రాజస్తాన్ రాయల్స్‌ను గెలిపించిన హిట్టర్
10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 27 నాటౌట్
పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి
ముల్లాన్‌పూర్: ఇరుజట్ల బౌలర్లు శాసించిన మ్యాచ్‌లో... హెట్‌మైర్‌లాంటి హిట్టర్ చివరి ఓవర్ ఆడటంతో పంజాబ్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. మొత్తమ్మీద కేశవ్ మహరాజ్ స్పిన్, అవేశ్ పేస్, హెట్‌మైర్ మెరుపులు వెరసి రాజస్తాన్ ఖాతాలో ఐదో విజయం చేరింది.
శనివారం జరిగిన ఈ పోరులో రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గట్టెక్కింది. మొదట పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అశుతోష్ శర్మ (16 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు! కేశవ్ మహరాజ్, అవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి గెలిచింది. యశస్వి జైస్వాల్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెట్‌మైర్ (10 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించారు.
బోర్ కొట్టించిన కింగ్స్ ఇన్నింగ్స్
అథర్వ (15), బెయిర్‌స్టో (15), ప్రభ్‌సిమ్రాన్ (10), తాత్కాలిక కెప్టెన్ స్యామ్ కరన్ (6)... పంజాబ్ ఇన్నింగ్స్‌లో టాప్–4 బ్యాటర్ల స్కోరు! 12.1 ఓవర్లలో 70/5 వద్ద కింగ్స్ ఆటతీరు! దీంతో పవర్ ప్లే సహా ఆఖరి దాకా పంజాబ్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది... ఆకట్టుకుంది ఏ ఒక్కటీ లేదు. జితేశ్ 29 పరుగులు చేసినా... 24 బంతులు ఆడాడు. అశుతోష్ బాదిన ఆ మాత్రం మెరుపులే పంజాబ్ కొద్దోగొప్పో స్కోరుకు దోహదపడ్డాయి.
తడబడినా... ఉత్కంఠకు నిలబడి...
లక్ష్యం కష్టమైంది కాదు! ఓపెనర్లు తొలి వికెట్‌కు 56 పరుగుల శుభారంభం ఇచ్చారు. అయినా కూడా రాజస్తాన్ తడబడింది. యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‌లో ‘ఇంపాక్ట్’ చూపగా, తనుశ్ కొటియన్ (31 బంతుల్లో 24; 3 ఫోర్లు) మోస్తరు పరుగులు చేశాడు.
రబడ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో యశస్వి, సంజు సామ్సన్ (18)లను అవుట్ చేసి ఒత్తిడి పెంచాడు. పడుతూ... లేస్తూ జట్టు వంద స్కోరు దాటాక హిట్టర్ రియాన్ పరాగ్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్), ధ్రువ్ జురెల్ (6)లు కూడా రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరడంతో 14 బంతుల్లో 30 పరుగుల సమీకరణం గుదిబండగా మారింది.
ఈ దశలో హెట్‌మైర్ 17వ ఓవర్ చివరి రెండు బంతుల్లో 4, 6 కొట్టాడు. తర్వాత స్యామ్ కరన్ 2 బౌండరీలు ఇచ్చినా పావెల్ (11), కేశవ్ (1)లను అవుట్ చేశాడు. అర్ష్దీప్ ఆఖరి ఓవర్లో తొలి 2 బంతులకు పరుగే ఇవ్వలేదు. కానీ హెట్‌మైర్ 6,2,6లతో మరో బంతి మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: అథర్వ (సి) కుల్దీప్ సేన్ (బి) అవేశ్ 15; బెయిర్‌స్టో (సి) హెట్‌మైర్ (బి) కేశవ్ 15; ప్రభ్‌సిమ్రన్ (సి) జురెల్ (బి) చహల్ 10; స్యామ్ కరన్ (సి) జురెల్ (బి) కేశవ్ 6; జితేశ్ (సి) పరాగ్ (బి) అవేశ్ 29; శశాంక్ (సి) జురెల్ (బి) కుల్దీప్ సేన్ 9; లివింగ్‌స్టోన్ (రనౌట్( 21; అశుతోష్ (సి) కేశవ్ (బి) బౌల్ట్ 31; హర్‌ప్రీత్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–27, 2–41, 3–47, 4–52, 5–70, 6–103, 7–122. బౌలింగ్: బౌల్ట్ 4–0–22–0, కుల్దీప్ సేన్ 4–0–35–1, అవేశ్ ఖాన్ 4–0–34–2, చహల్ 4–0–31–1, కేశవ్ మహరాజ్ 4–0–23–2.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) హర్షల్ (బి) రబడ 39; తనుశ్ (బి) లివింగ్‌స్టోన్ 24; సామ్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రబడ 18; పరాగ్ (సి) రబడ (బి) అర్ష్దీప్ 23; జురెల్ (సి) శశాంక్ (బి) హర్షల్ 6; హెట్‌మైర్ (నాటౌట్) 27; పావెల్ (సి) జితేశ్ (బి) స్యామ్ కరన్ 11; కేశవ్ (సి) లివింగ్‌స్టోన్ (బి) స్యామ్ కరన్ 1; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–56, 2–82, 3–89, 4–113, 5–115, 6–136, 7–138. బౌలింగ్: అర్ష్దీప్ 3.5–0–45–1, రబడ 4–0–18–2, సామ్ కరన్ 4–0–25–2, లివింగ్‌స్టోన్ 3–0–21–1, హర్షల్ 2–0–21–1, హర్‌ప్రీత్ బ్రార్ 3–0–22–0.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా X లక్నో
వేదిక: కోల్‌కతా
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
ముంబై X చెన్నై
వేదిక: ముంబై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment