
అహ్మదాబాద్: భారత్‌తో జరిగిన నాలుగో టీ20 ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ బ్యాట్ విరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ గెలుపునకు 3 బంతుల్లో 10 పరుగులు కావాల్సిన తరుణంలో శార్ధూల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో ఆర్చర్ బ్యాట్ విరిగిపోయింది. క్రికెట్‌లో బ్యాట్ విరగిపోవడం అనేది సాధారణమైన విషయమే అయినప్పటికీ.. ఆర్చర్ ఈ ఘటనను మూడేళ్ల కిందటే ఊహించాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆర్చర్ మూడేళ్ల కిందట( 2018 మార్చి 7న) ఓ ట్వీట్ చేస్తూ.. "ఇంగ్లండ్‌లో ఎవరైనా మంచిగా బ్యాట్ రిపేర్ చేసే వాళ్లు ఉన్నారా" అంటూ తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను కోరాడు.
ఈ ట్వీటే ప్రస్తుతం నెటిజన్లను తికమక పెడుతుంది. ఆర్చర్‌కు భవిష్యత్తు ముందుగానే తెలుసిపోతుందా అనే అంశంమే వారి తికమకకు కారణం. గతంలో కూడా అతను చాలా సందర్భాల్లో వివిధ అంశాలకు సంబంధించిన విషయాలను ముందే ఊహించినట్టుగా ట్వీట్ చేసేవాడు. చాలామంది అతనిని 'క్రికెట్ నోస్ట్రడామస్'గా పిలుస్తుంటారు. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించి, 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్ ఇదే వేదికగా ఆదివారం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment