పంత్‌ కళ్లు చెదిరే సిక్స్‌‌.. ఈసారి ఆర్చర్‌ వంతు | Rishabh Pant Reverse Scoop Off Jofra Archer Became Viral In 1st T20 | Sakshi
Sakshi News home page

పంత్‌ కళ్లు చెదిరే సిక్స్‌‌.. ఈసారి ఆర్చర్‌ వంతు

Published Sat, Mar 13 2021 10:59 AM | Last Updated on Sat, Mar 13 2021 1:36 PM

Rishabh Pant Reverse Scoop Off Jofra Archer Became Viral In 1st T20 - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా యంగ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ రివర్స్‌ స్కూప్‌ షాట్‌కు ఫేవరెట్‌గా మారిపోయాడు. మొన్నటికి మొన్న నాలుగో టెస్టులో జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్ షాట్‌ ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా తొలి టీ20లో భాగంగా జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో మరోసారి రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడిన పంత్‌ కళ్లు చెదిరే సిక్సర్‌ కొట్టాడు. ఇన్నింగ్స్‌ 3వ ఓవర్లో 5వ బంతిని పంత్‌ మొత్తం మొ​కాళ్ల మీదకు వంగి రివర్స్‌ స్కూప్‌లో బ్యాట్‌ను పైకిలేపి థర్డ్‌మన్‌ దిశగా గాల్లోకి లేపాడు. అంతే సెకన్ల వ్యవధిలో బంతి బౌండరీ లైన్‌ ఆవల పడింది.

పంత్‌ షాట్‌కు ఆర్చర్‌ కాసేపు షాక్‌ అయ్యాడు.. కచ్చితంగా అతని మదిలో అండర్సన్‌ గర్తుకు వచ్చే ఉంటాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకముందు నాలుగో టెస్టులోనూ అండర్సన్‌ బౌలింగ్‌లో పంత్‌  ఇదే తరహా షాట్‌ ఆడాడు. కాగా కోహ్లి అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌(23 బంతుల్లో 21; 2 ఫోర్లు,1 సిక్స్‌) ఆరంభం నుంచి మంచి టచ్‌లోనే కనిపించాడు. కానీ స్టోక్స్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే పంత్‌ తర్వాత ఏ బ్యాట్స్‌మెన్‌ సరిగా ఆడకపోవడం.. శ్రెయాస్‌ అయ్యర్‌ ఒంటరి పోరాటంతో భారత్‌ 20 ఓవర్లలో 124 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 15.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 
చదవండి:
కోహ్లి డకౌట్‌; ఉత్తరాఖండ్‌ పోలీస్‌ వార్నింగ్‌
పంత్‌ను వదిలేశాం.. మీరు వదిలేస్తే మంచిది: రోహిత్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement