అహ్మదాబాద్: ఆసీస్‌తో సిరీస్ మొదలుకొని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ వరకు అద్భుతఫామ్‌ను ప్రదర్శిస్తూ రిషబ్ పంత్ ప్రస్తుతం హీరోగా మారిపోయాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా పంత్‌పై అంచనాలు మరోసారి పెరిగిపోయాయి. టెస్టుల్లోనే దూకుడు ప్రదర్శిస్తున్న పంత్ టీ20లో ఎలా విజృంభిస్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్‌పై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా వదిలేస్తే 'మ్యాచ్ విన్నర్'గా నిలుస్తాడని హిట్‌మ్యాన్ అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.''పంత్‌పై ఒత్తిడి లేకుండా చూసేందుకు టీమిండియా కట్టుబడి ఉంది. మరి మీ మీడియా కూడా అలా వదిలేస్తుందా? చెప్పండి. అతనిపై అంచనాలు పెట్టుకోవడం మంచిదే.. కానీ అతను విఫలమైతే ఆకాశానికెత్తిన మీరే మళ్లీ పాతాళానికి తోసేస్తారు. అందుకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. పంత్‌ను తన ఆట తనను ఆడనివ్వండి.. టీమిండియా అతన్ని ఎప్పుడో వదిలేసింది.
పంత్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఎంత స్వేచ్ఛగా వదిలేస్తే అంత బాగా రాణిస్తాడు. పంత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లపై టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. మీడియా ఒత్తిడి తేవడం తప్పించి అతడిని మరేదీ ఆపలేదు. ఇంకా గొప్ప విషయమేంటంటే.. కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును ఎలా ఆదుకోవాలనేది పంత్ తెలుసుకోవడం మంచి పరిణామం'' అని చెప్పవచ్చు. కాగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లె అహ్మదాబాద్ వేదికగానే జరగనున్నాయి.
చదవండి:
'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు'
పాంటింగ్ ట్వీట్‌కు పంత్ అదిరిపోయే రిప్లై
Comments
Please login to add a commentAdd a comment