
ఆగస్టు 27నుంచి సెప్టెంబర్ 11 వరకు జరిగే ఆసియా కప్ వేదికను శ్రీలంకనుంచి తరలించారు. ఈ టోర్నీ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ)లో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ధారించారు.
తమ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆసియా కప్‌ను నిర్వహించలేమని శ్రీలంక బోర్డు చేతులెత్తేయడంతో ప్రత్యామ్నాయ వేదికను చూడక తప్పలేదు. ఆసియా కప్ జరిగే సీజన్‌లో ఉండే వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే ఒక్క యూఏఈలోనే వర్షాలు పడే అవకాశం లేదు కాబట్టి దానినే ఖాయం చేశామని గంగూలీ స్పష్టం చేశారు.
చదవండి: IND vs WI: విరాట్ కోహ్లికి రెస్ట్ అవసరమా..? అసలే ఫామ్ కోల్పోయి..!