Photo Credit: BCCI Twitter
ఆసియా గేమ్స్‌లో మహిళల క్రికెట్ విభాగంలో ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన షఫాలీ.. ఫైనల్లోనూ 48 పరుగులతో ఆకట్టుకుంది. ఇక క్వార్టర్స్‌లోనూ 40 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌తో అలరించిన షఫాలీ తాజాగా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లోనూ రఫ్పాడించింది.
బ్యాటింగ్ విభాగంలో రెండు స్థానాలు ఎగబాకిన షఫాలీ వర్మ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం దిగజారి ఆరో స్థానంలో నిలవగా, హర్మన్‌ప్రీత్ కౌర్ పదో స్థానాన్ని నిలబెట్టుకుంది. బౌలింగ్ విభాగంలో శ్రీచరణి, దీప్తి శర్మలు తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. మిగతా ప్లేయర్ల విషయానికొస్తే.. క్రాంతి గౌడ్ 15 స్థానాలు ఎగబాకి 57వ స్థానంలో నిలవగా, నందనీ శర్మ 22 స్థానాలు ఎగబాకి 72వ స్థానంలో నిలిచింది.
మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. ఇక కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది.
ఇదీ చదవండి: శ్రీలంకతో తొలి వన్డే.. రూట్ ప్రపంచ రికార్డు


