శ్రీలంకతో తొలి వన్డే.. రూట్ ప్రపంచ రికార్డు | Root Joins-Kohli-Surpass-Sachin-Complete-23000-Runs-International Cricket | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో తొలి వన్డే.. రూట్ ప్రపంచ రికార్డు

Sep 22 2026 7:51 PM | Updated on Sep 22 2026 9:07 PM

Root Joins-Kohli-Surpass-Sachin-Complete-23000-Runs-International Cricket

Photo Credit: Twitter

చెస్టర్‌-లీ-స్ట్రీట్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ మరో రికార్డు సాధించాడు. మ్యాచ్‌లో 52 బంతుల్లో 44 పరుగులు సాధించిన రూట్ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 23 వేల పరుగుల మార్క్ అందుకున్న ఎనిమిదో బ్యాటర్‌గా నిలిచాడు.

అయితే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. 521 ఇన్నింగ్స్‌ల్లో రూట్ 23వేల పరుగుల మార్క్‌ను అందుకోగా, కోహ్లి 490 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఇక సచిన్ టెండూల్కర్ (522 ఇన్నింగ్స్‌లు), మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఆ తర్వాత రికీ పాంటింగ్ (544 ఇన్నింగ్స్‌లు), జాక్ కలిస్ (551 ఇన్నింగ్స్‌లు), కుమార సంగక్కర (568 ఇన్నింగ్స్‌లు) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహుల్ ద్రవిడ్ (576 ఇన్నింగ్స్‌లు), జయవర్దనే (645 ఇన్నింగ్స్‌లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. రూట్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ఇక ఓవరాల్‌గా రూట్ ఇప్పటివరకు 169 టెస్టుల్లో 14, 278 పరుగులు (41 సెంచరీలు), 193 వన్డేల్లో 7,849 పరుగులు (20 సెంచరీలు), 32 టీ20ల్లో 893 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ త‌ర‌ఫున ఆల్‌టైమ్ స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. ఇక ఓవ‌రాల్ జాబితాలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్ల జాబితాలోనూ రూట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఈ మ‌ధ్య కాలంలో రూట్ సూప‌ర్ ఫామ్ క‌న‌బ‌రుస్తున్నాడు. 2026లో 20 ఇన్నింగ్స్‌ల్లో 1020 ప‌రుగులు సాధించిన రూట్ ఖాతాలో రెండు సెంచ‌రీలు, ఎనిమిది హాప్ సెంచ‌రీలున్నాయి. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 30 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్ల న‌ష్టానికి 172 ప‌రుగులు చేసింది. కెప్టెన్ బ్రూక్ (58), జోస్ బ‌ట్ల‌ర్ (22) క్రీజులో ఉన్నారు.

ఇదీ చదవండి: ‘శ్రీ చరణి ఒక అద్భుతం.. భారత జట్టుకు అభినందనలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement