Photo: IPL Twitter
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను సీఎస్‌కే రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బెన్ స్టోక్స్ సీజన్ మొత్తం అందుబాటులో ఉన్నా ఆడింది మాత్రం రెండు మ్యాచ్‌లు. రెండు మ్యాచ్‌లు కలిపి 16 పరుగులు చేశాడు. రూల్ ప్రకారం ఐపీఎల్‌లో ఒక ఆటగాడు ఒక్క మ్యాచ్ ఆడిన పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే. ఈ విషయంలో బెన్ స్టోక్స్ లాభపడ్డాడు. ఎందుకంటే రెండు మ్యాచ్‌ల్లో 16 పరుగులు చేసిన స్టోక్స్ ఒక్క పరుగుకు కోటి చొప్పున రూ.16.25 కోట్లు అందుకోనున్నాడు.
ఇక్కడ విషయం అది కాదు. అంత డబ్బు పెట్టి కొన్నా కూడా బెన్ స్టోక్స్ అవసరం సీఎస్‌కేకు పెద్దగా లేకుండా పోయింది. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలోనూ ధోని స్టోక్స్‌కు చోటు కల్పించలేదు. దీనికి తోడు విదేశీ ప్లేయర్ల కోటాలో నలుగురికి చాన్స్ ఉన్నా ధోని మాత్రం.. డెవన్ కాన్వే, మొయిన్ అలీ, మహీష్ తీక్షణలకు మాత్రమే వరుసగా అవకాశాలు ఇచ్చాడు. దీన్నిబట్టి ధోని విదేశీ ఆటగాళ్ల కన్నా స్వదేశీ ఆటగాళ్లనే ఎక్కువగా నమ్మాడు.
బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనిలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. వీరికి విదేశీ కోటా నుంచి మొయిన్ అలీ, కాన్వేలు తోడయ్యారు. ఇక బౌలర్లలో విదేశీ బౌలర్ల కంటే తుషార్ దేశ్ పాండే, దీపక్ చహర్, మతీషా పతిరానా, జడేజాలనే ఎక్కువగా నమ్మాడు. మహీష్ తీక్షణ ఒక్కడే బౌలర్ల కోటా నుంచి సీఎస్‌కే జట్టులో చోటు దక్కించుకున్నాడు. వీరు మినహా మిగతా విదేశీ ప్లేయర్లలో ఒక్కరికి కూడా అవకాశం రాలేదు.
ఇలా చేయడం ధోనికి కొత్త కాదు. గత 15 సీజన్లలో ధోని ఎక్కువగా దేశవాలీ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవాడు. ఇది చూసిన అభిమానులు.. ''పోతే పోయాయి రూ. 16.25 కోట్లు.. కానీ విదేశీ కన్నా స్వదేశీ ప్లేయర్లే ముద్దు అన్న ధోని ఫిలాసఫీ నచ్చినా.. కనీసం స్టోక్స్ అన్ని కోట్లు పట్టుకుపోతున్నాడు కాబట్టి ఇంపాక్ట్‌గా ఎంపిక చేసినా బాగుండు.. ఏంటో స్టోక్స్ మ్యాచ్‌లాడడానికి వచ్చినట్లు లేదు.. సమ్మర్ హాలిడేస్ ముగించుకొని కోట్లు పట్టుకుపోతున్నట్లు ఉంది.. ఎలాగూ కోట్లు పట్టుకుపోతున్నాడు.. ఆ చెల్లని రూ. 2వేల నోట్లు ఇచ్చి పంపండి'' అంటూ అభిప్రాయపడ్డారు.
We gave 16 crs For Ben Stokes to have a Vacation in India
— Pandu Raj (@CSKianPanduRaj) May 20, 2023
Intha ben stokes ku 16.25 kudukanum la ..
— Chennai Memes (@MemesChennai) May 20, 2023
Atha fulla 2000 Note ah Kuduthuduvey ... pic.twitter.com/evmOSoObIA
చదవండి: యశస్వి జైశ్వాల్ చరిత్ర.. తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment