చెస్‌లో అద్భుతాలు సృష్టిస్తోన్న చిచ్చరపిడుగు | Bodhana Sivanandan Becomes England Top Female Chess player Age 11 | Sakshi
Sakshi News home page

Bodhana Sivanandan: చెస్‌లో అద్భుతాలు సృష్టిస్తోన్న చిచ్చరపిడుగు

Apr 4 2026 7:01 AM | Updated on Apr 4 2026 9:14 AM

Bodhana Sivanandan Becomes England Top Female Chess player Age 11

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన చెస్‌ చిచ్చరపిడుగు బోధన శివనందన్‌ ఇంగ్లండ్‌ మహిళల చెస్‌ టాప్‌ ర్యాంకర్‌గా అవతరించింది. శుక్రవారం విడుదల చేసిన అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) రేటింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన 11 ఏళ్ల బోధన 2366 పాయింట్లు సాధించి 72వ ర్యాంక్‌లో నిలిచింది. 

తొలిసారి టాప్‌–100లోకి వచ్చిన బోధన ఈ క్రమంలో 2306 పాయింట్లతో ఇంగ్లండ్‌ టాప్‌ ప్లేయర్‌గా ఉన్న 25 ఏళ్ల లాన్‌ యావోను అధిగమించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన బోధన తల్లిదండ్రులు 2007లో ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గత ఏడాది ఉమన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదా పొందిన బోధన ఇటీవల జరిగిన యూరోపియన్‌ క్లబ్‌ కప్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ మరియా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)పై సంచలన విజయం నమోదు చేసింది.  

10వ ర్యాంక్‌లో అర్జున్‌ 
మరోవైపు ఓపెన్‌ కేటగిరీలో తెలంగాణ ప్లేయర్‌ ఇరిగేశి అర్జున్‌ భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. తాజా రేటింగ్స్‌లో అర్జున్‌ 2751 పాయింట్లతో 10వ ర్యాంక్‌లో నిలిచాడు. 2741 పాయింట్లతో ప్రజ్ఞానంద 12వ ర్యాంక్‌లో, 2732 పాయింట్లతో ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ 15వ ర్యాంక్‌లో ఉన్నారు. 

మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి 2535 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో ఉంది. 2510 పాయింట్లతో దివ్య దేశ్‌ముఖ్‌ పదో ర్యాంక్‌లో, 2470 పాయింట్లతో ద్రోణవల్లి హారిక 18వ ర్యాంక్‌లో, 2470 పాయింట్లతోనే వైశాలి 19వ ర్యాంక్‌లో ఉన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement