బ‌ట్ల‌ర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్‌ | Buttler Guides-England Clean Sweep Sri-Lanka Winning 3rd-T20-8 Wickets | Sakshi
Sakshi News home page

బ‌ట్ల‌ర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్‌

Sep 19 2026 10:50 PM | Updated on Sep 19 2026 11:16 PM

Buttler Guides-England Clean Sweep Sri-Lanka Winning 3rd-T20-8 Wickets

Photo Credit: Twitter

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో శ్రీలంక వైట్‌వాష్‌కు గురైంది. మాంచెస్ట‌ర్ వేదిక‌గా శ‌నివారం జ‌రిగిన చివ‌రి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో లంక‌పై విజ‌యం సాధించింది. ఫ‌లితంగా ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 18.5 ఓవ‌ర్ల‌లో 124 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాతుమ్ నిస్సాంక (36), క‌మిందు మెండిస్ (35) ప‌ర్వాలేద‌నిపించారు. 

ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సొన్ని బేక‌ర్, జోఫ్రా ఆర్చ‌ర్, విల్ జాక్స్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఇంగ్లండ్ 9.4 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి  ల‌క్ష్యాన్ని అందుకుంది. ఓపెన‌ర్ జాస్ బ‌ట్ల‌ర్ (32 బంతుల్లో 62 నాటౌట్‌) అజేయ అర్థ‌సెంచ‌రీతో విధ్వంసం సృష్టించగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (33) రాణించాడు. లంక బౌల‌ర్ల‌లో త‌రిందు ర‌త్నాయ‌కే ఒక వికెట్ తీశాడు. 

మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన సొన్ని బేక‌ర్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 170 ప‌రుగులు చేసిన హ్యారీ బ్రూక్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కైవ‌సం చేసుకున్నాడు. హ్యారీ బ్రూక్‌కు కెప్టెన్‌గా 26 మ్యాచ్‌ల్లో ఇది 23వ విజ‌యం కావ‌డం విశేషం. ఇరుజ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే మ్యాచ్ మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది.

ఇదీ చదవండి: టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో ఊహించని వ్యక్తి.. ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement