సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా భారత్ సౌతాఫ్రికా గడ్డపై నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఇదే జోష్‌లో టీమిండియా డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలోనూ ఎగబాకింది.
చదవండి: విజయంతోనే 'ప్రారంభం.. ముగింపు'; సూపర్ టీమిండియా
సౌతాఫ్రికాపై స్టన్నింగ్ విక్టరీ సాధించిన భారత్ ఓవరాల్‌గా 4 విజయాలు.. ఒక ఓటమి.. రెండు డ్రాలతో 64.28 పర్సంటేజీ పాయింట్లు(54 పాయింట్లు) తో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా 3 విజయాలతో 100 పర్సంటైల్(36 పాయింట్లు)తో తొలి స్థానం.. శ్రీలంక 2 విజయాలతో 100 పర్సంటైల్(24 పాయింట్లు)తో రెండో స్థానంలో.. పాకిస్తాన్ 3 విజయాలు.. ఒక ఓటమితో 75 పర్సంటైల్(75 పాయింట్లతో) మూడో స్థానంలో ఉన్నాయి. ఇక వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వరుసగా ఐదు, ఆరు, ఏడో స్థానాల్లో నిలవగా.. టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
చదవండి: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా రాసింది ఒక చరిత్ర..
The #WTC23 standings after India’s win in the first #SAvIND Test 👀 pic.twitter.com/rNyK8GKRgs
— ICC (@ICC) December 30, 2021
Comments
Please login to add a commentAdd a comment