ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ కోకో గాఫ్ ప్రయాణం సెమీస్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన ముచోవా 6-2, 1-6, 7-6 (12/10)తో గాఫ్‌పై విజయాన్ని అందుకొని ఫైనల్లో ప్రవేశించింది. అయితే మ్యాచ్ ఓటమి తర్వాత గాఫ్‌పై విమర్శలు వచ్చాయి.
వింబుల్డన్‌లో సెమీస్‌లో నిష్క్రమించడంపై కొంతమంది పనిగట్టుకొని ఆమెను హేళన చేస్తూ అసభ్యకర కామెంట్లు పెట్టారు. అప్పటికే ఓటమి బాధలో ఉన్న 22 ఏళ్ల గాఫ్‌కు కొంతమంది పెట్టిన కామెంట్లకు ఒళ్లు మండిపోయింది. దీంతో తనను ఎవరైతే విమర్శించారో వారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చింది.
'కొంతమంది నాపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో పాటు సందేశాలు పంపించారు. ఏం పర్వాలేదు. ఇలాంటి విమర్శలు, ట్రోల్స్ మనల్ని మరింత బలంగా ఫుంజుకోవడానికి ప్రేరేపిస్తాయి. ఈసారి వింబుల్డన్‌లో నేనే ఓడిపోయి ఉండొచ్చు. కానీ తర్వాతి ఏడాది గెలిచి నన్ను విమర్శించిన వారికి నా విజయాన్ని ట్యాగ్ చేసి గట్టి సమాధానం ఇవ్వాలనుకుంటున్నా' అని గాఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొంది.
ఇక కోకో గాఫ్ తన కెరీర్‌లో 2023 యూఎస్ ఓపెన్‌తో పాటు 2025 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. ఈసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌తో మూడో టైటిల్ ఖాతాలో వేసుకుంటుందని ఆశించినప్పటికీ కోకో గాఫ్ సెమీస్‌కు పరిమితమైంది.
Coco Gauff on the hate comments she’s receiving after her loss to Muchova
“I already got some hate comments and stuff but it’s ok. It just makes you stronger. Bettors who are mad, the usual. But whatever, I’ll come on the winning end next time, I’ll be sure to tag ‘em.”… pic.twitter.com/agaqRnVHnz— The Tennis Letter (@TheTennisLetter) July 9, 2026
Read: నేపాల్‌తో చారిత్రక క్రికెట్ సిరీస్.. వైభవ్‌కు ప్రమోషన్!


