దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13 సీజన్‌తో ఒక ఖతర్నాక్ కుర్రాడు వెలుగులోకి వచ్చాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కేరళ కుర్రాడు దేవదూత్ పడిక్కల్ అరంగేట్రం ఐపీఎల్ మ్యాచ్‌లోనే అదుర్స్ అనిపించాడు. తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించి అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అరోన్ ఫించ్‌కు జతగా ఓపెనింగ్‌కు వచ్చాడు. పార్థీవ్ పటేల్‌ను పక్కన పెట్టి పడిక్కల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే యత్నంలో పడిక్కల్ అనుభవం ఉన్న ప్లేయర్‌లా ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై దాడికి దిగా అర్థం శతకం సాధించాడు.
అరంగేట్రం హాఫ్ సెంచరీ రికార్డు
దేవదూత్ తన అరంగేట్రం చేసిన మ్యాచ్‌ల్లో నాలుగు సందర్భాల్లో సాధించాడు. ఫస్ట్‌క్లాస్ అరంగేట్రంల్లో భాగంగా 2018లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్(77 రెండో ఇన్నింగ్స్‌లో) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆపై లిస్ట్-ఏ క్రికెట్‌లో భాగంగా జార్ఖండ్‌తో 2019 జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు సాధించాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో భాగటంగా ఉత్తరాఖాండ్‌తో జరిగిన అరంగేట్రంమ్యాచ్‌లో పడిక్కల్ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించాడు.
ఐదో ఆర్సీబీ ఆటగాడు
ఆర్సీబీతో తరఫున అరంగేట్రం మ్యాచ్‌ల్లో యాభై అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పడిక్కల్ ఐదోస్థానంలో నిలిచాడు. అంతకుముందు క్రిస్ గేల్(2011లో 102 నాటౌట్), ఏబీ డివిలియర్స్(2011లో 54 నాటౌట్), యువరాజ్ సింగ్(2014లో 52 నాటౌట్), శ్రీవాత్స్ గోస్వామి(2008లో 52)లు అరంగేట్రం మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన ఆర్సీబీ ఆటగాళ్లు. ఆ తర్వాత పడిక్కల్ వారి సరసన చేరాడు.
గత సీజన్‌లో విజరు హజారే ట్రోఫీలో (50 ఓవర్లు), సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీల్లో పడిక్కల్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 20 ఏండ్ల పడిక్కల్ 175.75 స్ట్రయిక్‌రేట్‌తో 580 పరుగులు పిండుకున్నాడు. సగటున ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఓ అర్థ సెంచరీ సాధించి వెలుగులోకి వచ్చాడు. ఏబీ డివిలియర్స్ వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగే క్రమంలోనే పడిక్కల్‌కు లైన్ క్లియర్‌పై కోహ్లి మొగ్గుచూపాడు. దూకుడు, సహనం, సంయమనం, టెక్నిక్, టెంపర్‌మెంట్ కలిగిన పడిక్కల్ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. టాప్ ఆర్డర్‌లో పడిక్కల్‌ను ప్రయోగం చేయాలన్న ఆర్సీబీ వ్యూహం ఫలించింది.
Comments
Please login to add a commentAdd a comment