రాహుల్‌ను కాపాడిన పడిక్కల్‌.. ముద్దు పెట్టే ప్రయత్నం! | Devdutt Padikkal Saves-KL-Rahul-Suggest-Take-DRS-Live Match-1st Test | Sakshi
Sakshi News home page

SL Vs IND: రాహుల్‌ను కాపాడిన పడిక్కల్‌.. ముద్దు పెట్టే ప్రయత్నం!

Aug 18 2026 11:19 AM | Updated on Aug 18 2026 12:24 PM

Devdutt Padikkal Saves-KL-Rahul-Suggest-Take-DRS-Live Match-1st Test

Photo Credit: BCCI Twitter

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ తెలివైన నిర్ణయంతో కాపాడాడు. విషయంలోకి వెళితే.. భారత్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 11వ ఓవర్ ప్రబాత్ జయసూరియా వేశాడు. ఆ ఓవర్‌లో ఐదో బంతిని 25 పరుగులతో ఆడుతున్న రాహుల్ భారీ సిక్సర్‌గా మలిచాడు. 

అయితే మరుసటి బంతిని రాహుల్ మిస్ చేయడంతో బంతి ప్యాడ్లను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీంతో లంక ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అయితే మొదట కేఎల్ రాహుల్ తాను ఔటయ్యానని భావించి రివ్యూ తీసుకోవడానికి ఆలోచించాడు. అదే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న పడిక్కల్ మాత్రం రివ్యూకు వెళ్లాలని రాహుల్‌కు సైగ చేశాడు. దీంతో రాహుల్ రివ్యూ కోరాడు. 

ఇక రివ్యూలో బంతి బ్యాట్‌కు ఎక్కడా తగల్లేదు, కానీ లైన్‌లోనే వెళ్లడంతో మొదట ఔట్ అనిపించినప్పటికీ, బంతి స్టంప్స్ పైనుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో లంక ఆటగాళ్లు నిరాశలో మునిగిపోగా, కేఎల్ రాహుల్ మాత్రం పడిక్కల్ వద్దకు వచ్చి అతన్ని హగ్ చేసుకున్నాడు. 

రివ్యూ తీసుకోమని చెప్పినందుకు థాంక్స్ అన్నట్లుగా రాహుల్ అతడికి ముద్దు పెడుతున్నట్లుగా బ్రొమాన్స్‌ చేయడం కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ పడిక్కల్ రివ్యూ తీసుకోవాలని చెప్పకపోయుంటే రాహుల్ పెవిలియన్ బాట పట్టేవాడే. అయితే తనకు లభించిన అవకాశాన్ని రాహుల్ వినియోగించు కోలేకపోయాడు. మళ్లీ అదే ప్రబాత్ జయసూరియా బౌలింగ్‌లో భారీ షషాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు.

ఇక టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించడంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.  రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వేగంగా ఆడి లంక ఎదుట భారీ టార్గెట్‌ను నిర్దేశించాలని భావిస్తోంది. ఆటకు మరో రోజు సమయం మిగిలి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement