MS Dhoni Limping During Training Raises Concern Ahead Of IPL 2023 - Sakshi
Sakshi News home page

IPL 2023: సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. ధోని దూరం! కెప్టెన్‌గా రుత్‌రాజ్‌

Published Thu, Mar 30 2023 5:09 PM | Last Updated on Thu, Mar 30 2023 9:28 PM

Dhoni Limping During Training Raises Concern Ahead Of IPL 2023 - Sakshi

( Photot Credit: IPL/BCCI)

ఐపీఎల్‌-2023 సీజన్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న గుజరాత్‌ టైటాన్స్‌-చెన్నైసూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు తెరలేవనుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఊహించని షాక్‌ తగిలింది. ఆజట్టు కెప్టెన్‌ ఎంఎస్ ధోని గుజరాత్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో ధోని ఎడమ కాలికి గాయమైనట్లు "స్పోర్ట్‌స్టార్‌" తమ నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో అతడికి తొలి మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని సీఎస్‌కే వైద్యబృందం సూచించినట్లు సమాచారం. ఒక వేళ ధోని దూరమైతే బెన్‌స్టోక్స్ లేదా రుతురాజ్ గైక్వాడ్ చెన్నై కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు(అంచనా): డెవాన్ కాన్వే(వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివం దూబే, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement