క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ తర్వాత అత్యుత్తమ సమరంగా భావించే యాషెస్ సిరీస్ శుక్రవారం(జూలై16) ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌తో ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
గతంలో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అలీ.. యాషెస్ సిరీస్‌కు ముందు తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. దీంతో గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన స్పిన్నర్ జాక్ లీచ్ స్ధానంలో అలీకి చోటు దక్కింది. ఇక తొలి టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ మిచిల్ స్టార్క్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పేసర్ హాజిల్‌వుడ్ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్
ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), మోయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్
Comments
Please login to add a commentAdd a comment