అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటను చూసేందుకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి ఇస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ టెస్టు తొలి రోజు ఆటను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ లు అహ్మాదాబాద్ కు రానున్నారు.
ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా తొలి రోజు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించకూడదని గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ తాజాగా స్పందించింది. అవన్నీ పుకార్లేనని జీసీఏ సెక్రటరీ అనిల్ పాటిల్ కొట్టిపారేశారు.
అనిల్ పాటిల్ మాట్లాడుతూ.. "అవన్నీ రూమర్స్ మాత్రమే. మొదటి రోజు టిక్కెట్లు ఇంకా బుక్‌మైషోలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. అయితే సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం కొన్ని ఎంపిక చేసిన సీట్లలో మాత్రం ప్రేక్షకులకు అనుమతి లేదు. మిగిలినవి ప్రేక్షకులు బుక్ చేసుకోవచ్చు" అని అతడు పేర్కొన్నాడు.
ఇక ఆసీస్-భారత్ మధ్య నాలుగో టెస్టు మార్చి9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టెస్టు సిరీస్‌ను 3-1తేడాతో సొంతం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు ముందు బెంగళూరుకు బిగ్ షాక్.. రూ.3 కోట్ల ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment