టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తీరు వివాదాస్పదంగా మారింది. గాయం పేరుతో ఆఖరి నిమిషంలో బంగ్లా టూర్ నుంచి తప్పుకున్న జడేజా.. కట్‌చేస్తే తన భార్య రివాబా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. గాయంతో బాధపడుతున్న ఒక ఆటగాడు ఇలా ప్రచారం చేయడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 1,5 తేదీల్లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా నార్త్ జామ్‌నగర్ నుంచి పోటీ చేస్తుంది. ఎలక్షన్ తేదీ దగ్గర పడడంతో భార్యకు అండగా జడేజా ప్రచారంలో పాల్గొన్నాడు. క్యాంపెయిన్‌లో పాల్గొనడం తప్పు కాదు కానీ తాను ఫిట్‌గా ఉన్నప్పటికీ గాయం పేరు చెప్పి బంగ్లా టూర్‌కు దూరమవ్వడం వివాదానికి దారి తీసింది. కేవలం తన భార్య తరపున ప్రచారం కోసమే జడ్డూ బంగ్లా పర్యటనకు వెళ్లడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి.
అంతేకాదు ప్రచారంలో భాగంగా జడేజా ఇండియన్ జెర్సీతో ఉన్న ఫోటోలతో బీజేపీ కరపత్రాలు పంచడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. అంటే జడేజా టూర్‌కు దూరంగా ఉండడం వెనుక పరోక్షంగా బీజేపీ కూడా ఒక కారణమని అభిమానులు పేర్కొన్నారు. ఎంత కాదన్నా ఈ తతంగం వెనుక అమిత్ షా కొడుకు జై షా ఉన్నాడన్న సంగతి బహిర్గతం. వెంటనే రవీంద్ర జడేజాపై చర్యలు తీసుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దేశం కోసం ఆడాల్సిన అవకాశం వచ్చినప్పుడు ఇలా దొంగసాకులు చెప్పి టూర్‌కు డుమ్మా కొట్టడం ఎంతవరకు కరెక్టని చాలా మంది అభిప్రాయపడ్డారు.
ఇక టీమిండియా.. బంగ్లాదేశ్ పర్యటన డిసెంబర్ 4న మొదలవుతుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా అదే రోజు తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 7, 10 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్, 22 నుంచి 26 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.
દ્વારકામાં રવિન્દ્ર જાડેજાની સભામાં ટીખળ, કોઈએ AAPના ખેસ ફેંક્યા#RavindraJadeja #Dwarka #Elections pic.twitter.com/FP4jNV239N
— Gujarat Tak (@GujaratTak) November 26, 2022
చదవండి: జడ్డూ గాయం నిజమేనా.. లేక భార్య ఎలెక్షన్ కోసం బంగ్లా టూర్‌కు డుమ్మా కొట్టాడా..?
Comments
Please login to add a commentAdd a comment