
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగు విజయాలు సాధించిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఐదో రౌండ్‌లో వియత్నాం గ్రాండ్‌మాస్టర్ క్వాంగ్ లియెమ్ లీ చేతిలో 0.5–2.5తో ఓడిపోయాడు.
ప్రస్తుత ఆసియా చాంపియన్ అయిన క్వాంగ్ లియెమ్ లీ, ప్రజ్ఞానంద మధ్య తొలి గేమ్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. రెండో గేమ్‌లో క్వాంగ్ 50 ఎత్తుల్లో... మూడో గేమ్‌లో 43 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలుపొందాడు. ఫలితం తేలిపోవడంతో నాలుగో గేమ్‌ను నిర్వహించలేదు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత కార్ల్‌సన్ (నార్వే) 13 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... ప్రజ్ఞానంద 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment