సాక్షి,ముంబై: ఆడపిల్లలనే వివక్షను పక్కన పెట్టి శ్రద్ధగా నేర్పించాలే గానీ, బాలికలు చాలా సులువుగా నేర్చుకుంటారు. ఏ రంగమైనా రాణించడంలో ముందుంటారు. అది క్రికెట్ అయినా మరోటైనా.. ఇంకేదైనా.. కోజికోడ్‌కు చెందిన ఆరేళ్ల మెహక్ ఫాతిమా ఇదే నిరూపిస్తోంది. ఇంత చిన్న వయసులోనే తన అసాధారణ ప్రతిభతో పలువురి ప్రశంలదుకుంటోంది. ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఈ చిన్నారిని ప్రతిభకు ముగ్ధులైపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అద్భుతమైన కిడ్స్‌కు సంబంధించినవి షేర్ చేస్తూ ఉంటాను. ఇదిగో మరో ఫ్యూచర్ సూపర్ స్టార్‌ను చూడండి అంటూ ఆయన ఫాతిమా వీడియోను రీట్వీట్ చేశారు. అంతేకాదు ఈ అమ్మాయిపై ఓసారి దృష్టి సారించండి.. ఈమె ప్రతిభను వృధాకానివ్వకండి అంటూ కేంద్ర క్రీడాశాఖమంత్రి కిరణ్ రిజుజుకి టాగ్ చేశారు.
ది బెటర్ ఇండియా ఈ చిచ్చర పిడుగును ట్విటర్ వేదికగా పాతిమా టాలెంట్‌ను పరిచయం చేసింది. అలాగే ఇన్‌స్టా అకౌంట్‌లో కూడా మెహక్ పాతిమా విశేషాలు వీడియోలున్నాయి. ఫాతిమా తన తండ్రి తన కంటే మూడేళ్లు చిన్నవాడైన తమ్ముడికి క్రికెట్ నేర్పిస్తుండగా జాగ్రత్తగా పరిశీలించింది. ‘‘నేను అమ్మాయిని కాబట్టి నాకు నేర్పించలేదా.. నాకూ నేర్పించండి’’ అని తండ్రిని డిమాండ్ చేసింది. దీంతో ఆయన ఫాతిమాకు కూడా నేర్పించ సాగారు. ఆమె నేర్చుకున్న తీరుకు స్వయానా తండ్రే ఆశ్యర్యపోయాడు. ఇక ఫాతిమా ప్రాక్టిసు చేస్తున్న వీడియో చూసి నెటిజనుల సంగతి సరేసరి.స్ట్రెయిట్ డ్రైవ్‌లు, పుల్ షాట్‌లను ఎదుర్కొంటున్నప్పుడు ఆమె బ్యాటింగ్ స్కిల్స్‌కి ఫిదా అయిపోతున్నారు.. ‘‘ఆ ఫుట్ వర్క్ చూడండి.. ఎంత సహజంగా ఆడుతోంది. ఆమె క్రికెట్ ఆడటానికే పుట్టినట్టుంది..కాబోయే లెజెండ్’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే 31 వేలకు పైగా వ్యూస్‌తో దూసుకు పోతోంది.
కాగా ఫాతిమా తండ్రి మునీర్ క్రికెటర్ కావడం విశేషం. మునీర్ తన 13 ఏళ్ళ వయసులోనే కాలికట్ విశ్వవిద్యాలయం జట్టు తరపున ఆడారట. ఇక ఫాతిమా సోదరుడు 18 నెలల వయసులో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. భవిష్యత్తులో తను మంచి క్రికెటర్ కావాలనుకుంటోందనీ, స్మృతి మంధన అంటే ఎంతో ఇష్టమని, ఆమెను ఫాలో అవుతూ, ఆమెలాగే ఆడాలని ప్రయత్నిస్తుందని చెబుతున్నారు ఫాతిమి పేరెంట్స్ మునీర్, ఖాదీజా. పాపకు తమ మద్దతు పూర్తిగా ఉంటుదని చెప్పారు.
I keep getting forwards about kids around the globe being prodigies in soccer or basketball. Ok world, here’s our future superstar. @KirenRijiju let’s keep an eye on this young lady & not let her talent be wasted... https://t.co/3aSxDqOMmh
— anand mahindra (@anandmahindra) June 12, 2021
Comments
Please login to add a commentAdd a comment