గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ, ఇటీవలే సర్జరీ చేయించుకున్న క్రికెట్ దిగ్గజం, ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ జెఫ్రీ బాయ్‌కాట్ (83) మరోసారి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. న్యుమోనియా కారణంగా జెఫ్రీ ఆరోగ్యం విషమంగా మారినట్లు జెఫ్రీ కుమార్తె ఎమ్మా తెలిపారు.
జెఫ్రీ 2002లో తొలిసారి క్యాన్సర్ బారినపడ్డారు. కీమో థెరపీ అనంతరం కోలుకున్నారు. అయితే, ఈ ఏడాది మేలో క్యాన్సర్ తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు.
తాజాగా, జెఫ్రీ ఆరోగ్యం విషమించిందని ఆయన కుమార్తె ఎమ్మా ఎక్స్ ద్వారా వెల్లడించారు. తన తండ్రి కోలుకోవాలని కోరుకుంటున్న వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన అభిమానులను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. న్యూమోనియా కారణంగా జెఫ్రీ అన్నపానియాలు తీసుకోలేకపోతున్నారని అన్నారు. ప్రస్తుతం జెఫ్రీ వెంటిలేటర్ పై ఉన్నారని, ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.
జెఫ్రీ 1964-1982 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 108 టెస్ట్‌లు, 36 వన్డేలు ఆడారు. ఇందులో 23 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీల సాయంతో తొమ్మిది వేల పైచిలుకు పరుగులు చేశారు. కెరీర్‌లో 609 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జెఫ్రీ.. 151 సెంచరీలు, 238 హాఫ్ సెంచరీల సాయంతో 48426 పరుగులు చేశాడు. అలాగే 313 లిస్ట్-ఏ గేమ్స్‌లో 8 సెంచరీలు, 74 అర్దసెంచరీల సాయంతో 10095 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment