IPL 2023, CSK Vs GT: Ruturaj Gaikwad 92 Runs Off 50 Balls, Here Video - Sakshi
Sakshi News home page

IPL 2023: రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసం.. 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో! వీడియో వైరల్‌

Published Fri, Mar 31 2023 10:34 PM | Last Updated on Sat, Apr 1 2023 8:54 AM

GT vs CSK: Ruturaj Gaikwad on fire in Ahmedabad,smashes 92 runs - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023 తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసం సృష్టించాడు. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుత్‌రాజ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. తృటిలో తన తొలి ఐపీఎల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని రుత్‌రాజ్‌ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 92 పరుగులు సాధించాడు.

అదే విధంగా ఐపీఎల్‌-2023లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా రుత్‌రాజ్‌ నిలిచాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే గుజరాత్‌ బౌలర్లపై గైక్వాడ్‌ విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లతో గైక్వాడ్‌  ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. అదే విధంగా గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు కూడా చుక్కలు చూపించాడు.

కాగా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన రుత్‌రాజ్‌.. తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను కేవలం 23 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా సీఎస్‌కే తరపున ఫాస్టెస్‌ హాఫ్‌ సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా రుత్‌రాజ్‌ నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చూసిన సీఎస్‌కే  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో రుత్‌రాజ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో ధోని(7 బంతుల్లో 14 పరుగులు) రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ,రషీద్‌ ఖాన్‌, జోషఫ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. 


చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement