ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విండీస్ సిరీస్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై కొంతమంది భారత మాజీ క్రికెటర్లు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేలవ ఫామ్‌లో ఉన్న కోహ్లి మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే తిరిగి తన రిథమ్‌ను పొందుతాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
ఇక మరి కొంతమంది దిగ్గజ ఆటగాళ్లు ఈ బ్రేక్ కోహ్లి తిరిగి మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లికి రెస్టు ఇవ్వడంపై భారత మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. "వెస్టిండీస్‌తో సిరీస్‌కు కోహ్లికి భారత సెలక్టర్లు ఎందుకు విశ్రాంతినిచ్చారో నాకు అర్థం కావడం లేదు. కోహ్లి టీ20 ప్రపంచకప్ భారత జట్టు ప్రణాళికలో ఉన్నట్లయితే.. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందడానికి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆడాలి.
ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంకప్‌లో భారత జట్టులో కోహ్లి కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాను. ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు అతడికి ఒక్క భారీ ఇన్నింగ్స్ అవసరం. కాబట్టి అతడికి ప్రతీ మ్యాచ్‌లోను అవకాశం ఇవ్వాలి. అయితే ఇటువంటి సమయంలో కోహ్లికి విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయం కాదు"అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.ఇక విండీస్ టూర్ నుంచి తప్పుకున్న కోహ్లి ప్రస్తతం ఫ్యామిలీతో గడుపుతున్నాడు.
చదవండి: SL Vs PAK: శ్రీలంకతో రెండో టెస్టు.. పాకిస్తాన్‌కు భారీ షాక్..!
Comments
Please login to add a commentAdd a comment