Dilip Vengsarkar
-
గత ఆరేడేళ్ల నుంచి చూస్తున్నా.. సెలక్టర్లకు కొంచెం కూడా తెలివి లేదు: భారత మాజీ క్రికెటర్
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. రోహిత్‌ను తప్పించి మరోక ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటిలో రోహిత్ కెప్టెన్సీవచ్చిన డోకా ఏమీ లేదు. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్సీపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వాఖ్యలు చేశాడు. "భారత సెలక్షన్ కమిటీ ఉన్న సెలెక్టర్లకు క్రికెట్‌పై కనీస అవహగన, ముందు చూపు లేనట్లుగా అన్పిస్తోంది. గత ఆరు-ఏడేళ్లుగా ఇదే నేను చూస్తున్నాను. వారు కొన్ని సిరీస్‌లలో ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేనప్పుడు శిఖర్ ధావన్‌ను భారత కెప్టెన్‌గా చేసారు. అదే వారు చేసిన తప్పు. ఇటువంటి సమయంలోనే యువ ఆటగాళ్లలో ఎవరో ఒకరికి జట్టు పగ్గాలు అప్ప జెప్పి ఫ్యూచర్ కెప్టెన్లను తయారు చేయాలి. కానీ బీసీసీఐ ఆ పని చేయలేదు. రోహిత్ తర్వాత భారత కెప్టెన్‌ను తాయారు చేయడంలో బీసీసీఐ విఫలమైంది. పేరుకే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. అంతేతప్ప కనీసం బెంచ్ బలాన్ని పెంచుకోవడం లేదు. కేవలం ఐపీఎల్ నిర్వహించడం, మీడియా హక్కుల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించడం మాత్రమే కాదు.. జట్టును తీర్చిదిద్దడంపై కూడా దృష్టిసారించాలి" అంటూ బీసీసీఐపై వెంగ్‌సర్కార్ విమర్శల వర్షం కురిపించాడు. చదవండి: IND vs WI: నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్న ఇషాన్ కిషన్.. ఎందుకంటే? -
దిగ్గజ బ్యాటర్‌ను అధిగమించిన పుజారా.. నెక్స్ట్ టార్గెట్ కోహ్లినే
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో నయా వాల్ చతేశ్వర్ పుజారా.. భారత దిగ్గజ బ్యాటర్ దిలీప్ వెంగసర్కార్ రికార్డును అధిగమించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి ఔటైన పుజారా.. టీమిండియా తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెంగ్‌సర్కార్‌ను వెనక్కునెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. వెంగ్‌సర్కార్ 116 టెస్ట్‌ల్లో 6868 పరుగులు చేయగా..పుజారా 97 టెస్ట్‌ల్లో 6882 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (15921 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122), వీవీఎస్ లక్ష్మణ్ (8781), వీరేంద్ర సెహ్వాగ్ (8503), విరాట్ కోహ్లి (8075), సౌరవ్ గంగూలీ (7212) పుజారా కంటే ముందున్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడతున్న ఆటగాళ్లలో కోహ్లి మాత్రమే పుజారా కంటే ముందున్నాడు. 97 టెస్ట్‌లు ఆడిన పుజారా.. 44.11 సగటున 18 సెంచరీలు, 34 అర్థ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో రోహిత్ శర్మ (3137) మాత్రమే పుజారాకు కాస్త దగ్గరగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. చతేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. రిషబ్ పంత్ (46) పర్వాలేదనిపించాడు. 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, శ్రేయస్ 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లి (1) నిర్శాపరిచారు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్ పటేల్ (14) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్ 2, ఖలీద్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
ఆజహార్, వెంగ్సర్కార్లను ఏకి పారేసిన గవాస్కర్.. బుద్ధి ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు
భారత క్రికెట్ దిగ్గజాల్లో ముఖ్యుడైన లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన సమకాలీకులైన దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజహారుద్దీన్లను ఏకి పారేశాడు. ఇటీవల ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్-2022 జట్టుపై ఆ ఇద్దరు చేసిన వ్యతిరేక కామెంట్స్‌కు సన్నీ ఘాటుగా బదులిచ్చాడు. ఆటగాళ్ల ఎంపిక జరిగాక వారిపై వ్యతిరేక కామెంట్లు చేసేందుకు బుద్ధి, జ్ఞానం ఉండాలని పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ ధ్వజమెత్తాడు. ఒకరి బదులు ఇంకొకరిని ఎంపిక చేసుంటే బాగుండేదని కామెంట్స్ చేసే ముందు ఓసారి ఆలోచించి ఉంటే బాగుండేదని గడ్డిపెట్టాడు. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల అంతర్జాతీయంగా మన దేశ పరువు దిగజారడంతో పాటు ఆటగాళ్లను నైతికంగా నిరుత్సాహపరిచినవారమవుతామంటూ మొట్టికాయలు వేశాడు. జట్టు ఎంపికపై అసంతృప్తి ఉన్నా దానిపై బహిరంగా కామెంట్ చేయకూడదన్న ఇంగిత జ్ఞానం ఉండాలని వాయించాడు. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా పని చేసిన అనుభవమున్న వారు జట్టు ఎంపిక తర్వాత ఆటగాళ్లను నిరుత్సాహపరిచే విధంగా కామెంట్లు చేయడమేంటని నిలదీశాడు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలకు జట్టును ఎంపిక చేసేప్పుడు సవాలక్ష సమీకరణలు ఉంటాయని, భారతీయులుగా మనం సెలెక్టర్ల ఛాయిస్‌కు గౌరవమివ్వాలి కాని, ఒకరి స్థానంలో ఇంకొకరిని ఎంపిక చేసుంటే బాగేండేదంటూ కామెంట్లు చేయకూడదని చురకలంటించాడు. జట్టు ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగినా వెనకేసుకురావాలి కానీ మన వీక్నెస్ను మనమే బహర్గతం చేసుకోకూడదని సూచించాడు. ఇదే సందర్భంగా సన్నీ రోహిత్ నేతృత్వంలో ఎంపిక చేయబడ్డ భారత వరల్డ్‌కప్ స్క్వాడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత వరల్డ్ కప్ జట్టు సమతూకంగా చాలా బాగుందని, ఈసారి హిట్‌మ్యాన్ సేన ఎలాగైనా టైటిల్ సాధించి మెగా టోర్నీల్లో భారత్ రాణించలేదన్న అపవాదును తొలగించాలని ఆకాంక్షించాడు. ఇందుకు కొద్దిగా లక్ కూడా తోడైతే టీమిండియాను ఆపడం ఎవరి వల్ల కాదని అభిప్రాయపడ్డాడు. భారత్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గాక ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత సెలెక్టర్లు టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ వ్యతిరేక కామెంట్లు చేశాడు. వరల్డ్ కప్ మెయిన్ జట్టులో శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ పేర్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, జట్టులో స్థానం పొందిన వారిలో దీపక్ హుడా, హర్షల్ పటేల్‌లను తప్పించి శ్రేయస్, షమీలకు ఛాన్స్ ఇస్తే బాగుండేదని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అజహార్ వ్యాఖ్యలకు వంత పాడుతూ వెంగసర్కార్ సైతం కొద్ది రోజుల తర్వాత ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తనైతే షమీ, ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్ గిల్లను ఎంపిక చేసే వాడినని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించాడు. -
'ఆ ముగ్గురు ఐపీఎల్లో అదరగొట్టారు.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాల్సింది'
టీ20 ప్రపంచకప్-2022 కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ కోసం ఎటువంటి సంచలనాలకు తావివ్వకుండా దాదాపు ఆసియా కప్ ఆడిన జట్టునే సెలెక్టర్లు ఎంపికచేశారు. ఆసియాకప్‌కు దూరమైన బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. కాగా టీ20 ప్రపంచకప్ కోసం ఎంపికచేసిన భారత జట్టుపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది జట్టు ఎంపికతో పూర్తిగా ఏకీభవిస్తున్నప్పటికీ.. మరి కొంత మంది జట్టులో ఒకట్రెండు మార్పులు చేయాల్సిందని భావిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా చేరాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో పేసర్లు మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, బ్యాటర్ శుబ్మాన్ గిల్ ఉండి బాగుండేది అని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మార్క్యూ ఈవెంట్ కోసం భారత జట్టుకు స్టాండ్‌బైగా మహ్మద్ షమీ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో వెంగ్‌సర్కార్ ఇండియన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడూతూ.. "నేను బీసీసీఐ సెలక్షన్ కమిటీలో భాగమైంటే టీ20 ప్రపంచకప్‌కు ఖచ్చితంగా షమీ, ఉమ్రాన్ మాలిక్, గిల్‌ను ఎంపిక చేసేవాడిని. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించారు. అదే విధంగా వారికి టీ20 క్రికెట్లో రాణించే సత్తా కూడా ఉంది. ఇక భారత జట్టులో ఎవరూ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారన్నది నేను అంచనా వేయలేను. అది కెప్టెన్, కోచ్ ఇష్టం. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సూర్యకుమార్ ఇకపై ఐదో స్థానంలో రావచ్చు. సూర్య భారత జట్టుకు గొప్ప ఫినిషర్ అవుతాడు" అని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: Babar Azam: అతడి కెరీర్ నాశనం చేస్తున్నారు! బాబర్ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్ ఏ టోర్నీ గెలవలేదు! -
విరాట్ కోహ్లికి రెస్ట్ అవసరమా..? అసలే ఫామ్ కోల్పోయి..!
ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విండీస్ సిరీస్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై కొంతమంది భారత మాజీ క్రికెటర్లు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేలవ ఫామ్‌లో ఉన్న కోహ్లి మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే తిరిగి తన రిథమ్‌ను పొందుతాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక మరి కొంతమంది దిగ్గజ ఆటగాళ్లు ఈ బ్రేక్ కోహ్లి తిరిగి మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లికి రెస్టు ఇవ్వడంపై భారత మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. "వెస్టిండీస్‌తో సిరీస్‌కు కోహ్లికి భారత సెలక్టర్లు ఎందుకు విశ్రాంతినిచ్చారో నాకు అర్థం కావడం లేదు. కోహ్లి టీ20 ప్రపంచకప్ భారత జట్టు ప్రణాళికలో ఉన్నట్లయితే.. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందడానికి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆడాలి. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంకప్‌లో భారత జట్టులో కోహ్లి కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాను. ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు అతడికి ఒక్క భారీ ఇన్నింగ్స్ అవసరం. కాబట్టి అతడికి ప్రతీ మ్యాచ్‌లోను అవకాశం ఇవ్వాలి. అయితే ఇటువంటి సమయంలో కోహ్లికి విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయం కాదు"అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.ఇక విండీస్ టూర్ నుంచి తప్పుకున్న కోహ్లి ప్రస్తతం ఫ్యామిలీతో గడుపుతున్నాడు. చదవండి: SL Vs PAK: శ్రీలంకతో రెండో టెస్టు.. పాకిస్తాన్‌కు భారీ షాక్..! -
టీమిండియాకి ఆడాలంటే ఇది సరిపోదా.. ఇంకా ఏం చేయాలి?
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొడుతన్న యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు భారత జట్టలో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక 2022 రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఉత్తరాఖండ్‌తో జరగిన క్వార్టర్-ఫైనల్లో 153 పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 704 పరుగులు సాధించాడు. గత రంజీ సీజన్లో కూడా సర్ఫరాజ్ అద్భుతంగా రాణించాడు. అతడు 928 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 80.4 సగటుతో 2252 పరుగులు చేశాడు. "సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే టీమిండియా తరపున ఆడుతూ ఉండాలి. అతడు రంజీ ట్రోఫీలో ప్రతిసారీ పరుగులు వరుద పారిస్తున్నాడు. సెలెక్టర్లు ఇప్పటికీ అతడిని ఎంపిక చేయకపోవడంతో నేను ఆశ్చర్యపోయాను. ప్రతీ సీజన్లోనూ అతడు ముంబై జట్టుకు 800 కంటే ఎక్కువ పరుగులు చేస్తున్నాడు. భారత జట్టులోకి రావాలంటే అతడు ఏం చేయాలో మీరే చెప్పండి. నేను అతడిని 12 సంవత్సరాల వయస్సు నుంచి చూస్తున్నాను. అతడు చాలా ప్రతిభావంతుడు. అతడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. అంతే కాకుండా అతడు ఓపికతో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగలడు. అదే విధంగా జట్టును గెలిపించగల సత్తా అతడికి ఉంది" అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SA: జట్టులో అతడు తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు: సునీల్ గావస్కర్ -
IND VS SL: సూపర్ ఫామ్‌లో ఉన్న ఆ ఇద్దరినీ ఎందుకు ఎంపిక చేయలేదు..?
వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం 18 మంది సభ్యుల భారత జట్టును నిన్న (ఫిబ్రవరి 19) ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారధిగా, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టుకు కీలక ఆటగాళ్లైన రహానే, పుజారా, ఇషాంత్ శర్మ, సాహా లను ఎంపిక చేయకుండా కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫామ్ లేమి కారణంగా చూపి సీనియర్లను పక్కకు పెట్టిన సెలెక్షన్ కమిటీ.. దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న యువ ఆటగాళ్లను కూడా పట్టించుకోకపోడంపై సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ఎంపిక విధానంలో సెలెక్టర్లు అనుసరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ వివేకంగా ఆలోచించలేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ టోర్నల్లో పరుగుల వరద పారిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్‌లను ఎలా పక్కనబెడతారని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో కొందరికి టాలెంట్ ఉన్నా ఆమేరకు రాణించలేకపోతున్నారని, అలాంటి వారిని టీమిండియాకు ఎంపిక చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. రుతురాజ్, సర్ఫరాజ్ ఖాన్ లు ఇద్దరూ టీమిండియాలో ఉండాల్సిన వాళ్లని, సెలెక్టర్లు వారిని ఎంపిక చేయకుండా వారిద్దరి నైతికతను దెబ్బతీస్తున్నారని వాపోయాడు. కాగా, రుతురాజ్.. గతేడాది ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలవడంతో పాటు ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీలోనూ (నాలుగు సెంచరీలతో 600కు పైగా పరుగులు) పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. సర్ఫరాజ్ విషయానికొస్తే.. గతేడాది ముస్తాక్ అలీ టోర్నీతో పాటు ప్రస్తుతం జరగుతున్న రంజీల్లో అతను నిలకడగా రాణిస్తున్నాడు. తాజాగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 275 పరుగులు చేసినప్పటికీ సెలెక్టర్లు సర్ఫరాజ్‌ను పట్టించుకోలేదు. పై పేర్కొన్న గణాంకాలను ప్రస్తావిస్తూ వెంగ్‌సర్కార్ సెలెక్టర్ల తీరును ఎండగట్టాడు. ఇదిలా ఉంటే, శ్రీలంక జట్టు భారత పర్యటనలో 3 టీ20లతో పాటు 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరబ్ కుమార్ చదవండి: ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే! -
‘అప్పుడు కుంబ్లేను ఎంపిక చేశాం.. ఇప్పుడు అశ్విన్‌ను కెప్టెన్ చేయండి’
టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరున్నది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఇద్దరి పేర్లను కెప్టెన్‌గా సూచించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లను ఎంపిక చేశాడు. కాగా ఇప్పటికే రోహిత్ ఇప్పటికే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను చెపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు, అశ్విన్ ఇప్పటివరకు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించలేదు. "ప్రస్తుతానికి రోహిత్‌శర్మ లేక రవి అశ్విన్ భారత టెస్ట్ కప్టెన్సీ భాధ్యతలు అప్పజెప్పాలి. అనంతరం ఒక ఏడాది కాలం సమయం తీసుకుని కొత్త సారథిని ఎంపికచేస్తే బాగుంటుంది అని అతడు పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇలాంటి పరిస్థితిలో కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ సమయంలో భారత ప్రధాన సెలక్టర్‌గా వెంగ్‌సర్కార్.. సెలక్షన్ కమిటీ ఎదుర్కొన్న పరిస్ధితులను ఆయన గుర్తు చేసుకున్నారు. "ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు నేను, నా కమిటీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొకున్నాం. అంతేకాకుండా ఈ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు వెల్ల వలసింది ఉంది. అప్పటికే పొట్టి ఫార్మాట్లో కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్ ధోని పదోన్నతి లభిస్తుందని కొందరు భావించారు, అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అనిల్ కుంబ్లేను టెస్టులకు సారధిగా ఎంపిక చేశాం" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Ind Vs Sa 1st ODI: ధావన్‌కు షాక్... ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్! -
"గంగూలీ నీ పని నువ్వు చూసుకో.. ఆ విషయం వాళ్లు చూసుకుంటారు"
విరాట్ కోహ్లి కెప్టెన్సీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తప్పించి రోహిత్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంత మంది తప్పుపడుతుంటే, కొంత మంది సమర్ధిస్తున్నారు. ఈ క్రమంలో సెలక్షన్ కమిటీ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ జోక్యం చేసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ మండిపడ్డారు. "గంగూలీకి సెలక్షన్ కమిటీ తరపున మాట్లాడే హక్కు లేదు. అతడు బీసీసీఐ అధ్యక్షుడు, అతడికి సెలక్షన్ కమిటీలో జోక్యం చేసుకోనే అవసరం లేదు. జట్టు సెలెక్షన్ లేదా కెప్టెన్సీ గురించి ఏదైనా సమస్య ఉంటే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ మాట్లాడాలి. ఈ విషయం ముందే గంగూలీకి తెలుసు. టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి.. విరాట్ వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. సెలక్షన్ కమిటీ ద్వారా కెప్టెన్‌ని ఎంపిక చేస్తారు లేదా తొలగిస్తారు. అది గంగూలీ అధికార పరిధి కాదు. 1932 నుంచి (తొలి భారత జట్టు ఎంపికైనప్పటి నుంచి) ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు మారాలి. కోహ్లి భారత క్రికెట్ కోసం చాలా కష్టపడ్డాడు. అతడి పట్ల మీరు వ్యవహరించిన తీరు సరైనదికాదు. అది కచ్చితంగా కోహ్లిని బాధించి ఉంటుంది" అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నారు. చదవండి: Ashes 2021-22: "ఇంగ్లండ్ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. రూట్ వద్దే వద్దు" -
Ruturaj Gaikwad: అతడికి ఇప్పుడు 18, 19 కాదు.. 24.. 28 ఏళ్లకు ఆడిస్తారా?
Dileep Vengsarkar Comments On Ruthuraj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్.. ఈ పేరే ఒక సంచలనం.. ఐపీఎల్-2021లో అత్యధిక పరుగులు(635) సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఈ యువ ఆటగాడు.. విజయ్ హజారే ట్రోఫీలోనూ అదరగొడుతున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీలో ఇప్పటికే మూడు శతకాలు బాది సత్తా చాటాడు రుతురాజ్. మహారాష్ట్ర కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం దిలీప్ వెంగసర్కార్ రుతురాజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో వన్డే సిరీస్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయాలని సూచించాడు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో దిలీప్ వెంగసర్కార్ మాట్లాడుతూ... ‘‘మూడో స్థానంలో అతడు బ్యాటింగ్ చేయగలడు. తనను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలి. రుతురాజ్ వయసు పద్దెనిమిదో.. పందొమ్మిదో కాదు.. తనకు ఇప్పుడు 24 ఏళ్లు. ఇదే సరైన సమయం. ఒకవేళ 28 ఏళ్ల వయసులో అతడిని జట్టులోకి ఎంపిక చేసినా పెద్దగా ఫలితం ఉండబోదు కదా!’’ అని చెప్పుకొచ్చాడు. వయసు రీత్యా చూసినా, ఫామ్ పరంగా చూసినా రుతురాజ్ ఎంపికకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డాడు. కాగా రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్‌లో 435 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ ఓపెనర్‌ను ఐపీఎల్ మెగా వేలంలో నేపథ్యంలో ఆ జట్టు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అరంగేట్రం చేసిన రుతురాజ్తాజా ప్రదర్శన దృష్ట్యా... వన్డేల్లోనూ ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. చదవండి: ODI Captaincy: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?జరిగేది అదే: గంభీర్ 1⃣5⃣4⃣* Runs 1⃣4⃣3⃣ Balls 1⃣4⃣ Fours 5⃣ Sixes@Ruutu1331 was at his fluent best and scored his second successive hundred of #VijayHazareTrophy. 👏 👏 #CHHvMAH Watch his fantastic knock 🎥 🔽https://t.co/GcN3lB3gKC pic.twitter.com/wQ1GDPHeWf — BCCI Domestic (@BCCIdomestic) December 9, 2021 -
"విరాట్ కోహ్లిని తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది"
Dilip Vengsarkar feels split captaincy will work for India: టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తప్పించి రోహిత్‌ను ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కొంత మంది బీసీసీఐ నిర్ణయంను తప్పుబడుతుంటే.. కొంత మంది సమర్ధిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్.. వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదని తెలిపాడు. రోహిత్ శర్మ వైట్-బాల్ క్రికెట్లో సారధిగా బాగా రాణించాడు. అందు వల్ల బీసీసీఐ నిర్ణయం తీసుకుందని తెలిపాడు. "వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మను భారత కెప్టెన్‌గా నియమించడంలో బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా రోహిత్ బాగా రాణిస్తున్నాడు. అతడు చాలా కాలంగా కెప్టెన్సీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు, విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌పై దృష్టి పెట్టగలడు. కాగా వైట్-బాల్ క్రికెట్లో అతను ఇప్పటివరకు నాయకుడిగా అద్బుతంగా రాణిస్తున్నాడు. రోహిత్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఐదు సార్లు టైటిల్‌ను అందించాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా వచ్చిన అవకాశాల్లో రోహిత్ బాగా రాణించాడు". అని వెంగ్సర్కర్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి గ్రూపులు లేవు.. స్ప్లిట్ కెప్టెన్సీ గురించి మాట్లాడూతూ.. " క్రికెట్లో వేర్వేరు కెప్టెన్లు ఉండడం కొత్తేమీ కాదు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు, వన్టే, టీ20లకు వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ ప్రపంచ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుంది. ఇక భారత డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు గ్రూపులు లేవు అని నేను భావిస్తున్నాను. జట్టులో యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధన్యత ఉంది. యువ క్రికెటర్లు తమకు దొరికిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి" అని వెంగ్సర్కర్ తెలిపాడు. చదవండి: Rohit Sharma: దక్షిణాఫ్రికా సిరీస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
‘కోహ్లి నిర్ణయం సరైందే.. ఆ అర్హత ఉంది.. తను టీ20 వరల్డ్‌కప్ గెలవాలి’
Dilip Vengsarkar on Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ అన్నాడు. ఐసీసీ టైటిల్ గెలిచి సగర్వంగా పదవి నుంచి వైదొలగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా యూఏఈ వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత తాను టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లి గురువారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పనిభారం ఎక్కువైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే, వన్డే, టెస్టు సారథిగా కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి నిర్ణయంపై మాజీలు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఈ విషయం వెల్లడిచేయాల్సిందని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. వెంగసర్కార్ మాత్రం కోహ్లి నిర్ణయం సరైనదేనని పేర్కొన్నాడు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నేనిది ముందే ఊహించాను. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా అన్ని ఫార్మాట్లలో ఎనిమిదేళ్లుగా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్నాడు. కాబట్టి తనపై ఒత్తిడి ఉండటం సహజం. నిజానికి తను కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా వరల్డ్‌కప్ గెలిచి తను అత్యున్నత స్థాయిలో పదవి నుంచి వైదొలిగితే బాగుంటుంది. కోహ్లికి ఆ అర్హత ఉంది’’ అని అభిప్రాయపడ్డాడు. అంతేగాకుండా.. టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్న వెంగ్‌సర్కార్.. సంప్రదాయ క్రికెట్ పట్ల కోహ్లి విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించాడు. చదవండి: టి20 కెప్టెన్సీపై కోహ్లి నిర్ణయం.. అనుష్క స్పందన View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
టీమిండియా ఆ 42 రోజులు ఏం చేస్తుంది..?
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు బీసీసీఐ రూపొందించిన షెడ్యూల్‌పై భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ మండిపడ్డాడు. ఈ పర్యటనలో భారత్.. జూన్ 18 నుంచి 22 మధ్యలో న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్ ముగిశాక టీమిండియా 42 రోజులు ఖాళీగా ఉండటంపై భారత అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పర్యటనకు కుటుంబ సమేతంగా వెళ్తున్న భారత జట్టు ఇన్ని రోజుల పాటు ఖాళీగా కాలం గడపాల్సి వచ్చేలా షెడ్యూల్ రూపొందించడం ఏంటని వెంగ్సర్కా్ర్ నిలదీశాడు. ఇంత దారుణమైన షెడ్యూల్ ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక జట్టును దేశం కాని దేశంలో 42 రోజుల పాటు ఖాళీగా కూర్చోబెట్టడం ఏ మాత్రం సరికాదని, అన్ని రోజులు క్రికెటర్లు ఏం చేస్తారని ప్రశ్నించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన వెంటనే టెస్ట్ సిరీస్ ఆరంభం అయ్యేలా షెడ్యూల్ ఎందుకు రూపొందించలేకపోయారని ప్రశ్నించాడు. కాగా, దాదాపు నెలన్నర ఖాళీగా ఉన్న తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం.. జూన్ 3వ తేదీన ఇంగ్లండ్‌లో అడుగు పెట్టబోయే భారత జట్టు, అక్కడి నుంచి ఐపీఎల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్‌లో యూఏఈకి బయల్దేరనుంది. అంటే ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్.. దాదాపు నాలుగున్నర నెలలు కాలం అక్కడే గడపనుంది. చదవండి: మంజ్రేకర్ కోసం వెతికాను.. అతని కోసమే అలా చేశాను -
చీఫ్ సెలెక్టర్ అయి ఉంటే.. అతన్ని తీసుకొచ్చేవాడిని
పుణే: ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యాలు ధారాళంగా పరుగులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆడింది చాలు.. ఇక సెలవు.. అంటూ కామెంట్లు కూడా పెట్టారు. నేడు జరగనున్న మూడో వన్డేకు కుల్దీప్ స్థానంలో చహల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా.. కృనాల్ స్థానంలో సుందర్ బరిలోకి దిగే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తిరగి వన్డే జట్టులోకి తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ' నేను చీఫ్ సెలెక్టర్ అయి ఉంటే కచ్చితంగా వన్డే జట్టులోకి అశ్విన్‌ను ఎంపిక చేసేవాడిని. ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్డే క్రికెట్లో కుల్దీప్, చహల్ ఎవరిని చూసుకున్న రాణించే స్థితిలో లేరు. కెప్టెన్‌గా కోహ్లి అశ్విన్‌ను వన్డే జట్టులోకి తిరిగి తీసుకోవడం ద్వారా అతని అనుభవం చాలా ఉపయోగపడుతుంది. టెస్టు క్రికెట్‌తో వన్డేకు పోలిక లేకపోవచ్చు.. కానీ పరిమిత ఓవర్లలో అశ్విన్ అసవరం ఉన్నట్లు అనిపిస్తుంది. సుందర్, అశ్విన్ ఇద్దరు ఆఫ్ స్పిన్నరేనని.. ఎవరు ఒకరు జట్టులో ఉంటే సరిపోతుందని కోహ్లి ఒక సందర్భంలో చెప్పాడు. కానీ సుందర్‌కు, అశ్విన్‌కు ఏ మాత్రం పోలిక లేదు. ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు కావొచ్చు.. కానీ శైలి ఒకేలా ఉండదు. అనుభవం దృష్యా చూసుకుంటే అశ్విన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. పరిమిత ఓవర్లలో అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూనే వికెట్లు తీయగలడని నా నమ్మకం. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో కృనాల్- కుల్దీప్లు కలిసి 16 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 156 పరుగులు సమర్పించుకున్నారు. ఇలాగే కొనసాగితే వన్డే జట్టులో స్పిన్నర్లు రావడం కష్టమే. అందుకే అశ్విన్‌ను వన్డేల్లో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. కాగా అశ్విన్ టీమిండియా తరపున చివరి వన్డే 2017 జూన్‌లో ఆడాడు. అప్పటి నుంచి టెస్టు క్రికెట్‌కే పరిమితమైన అశ్విన్ 111 వన్డేల్లో 150 వికెట్లు, 78 టెస్టుల్లో 409 వికెట్లు, 46 టీ20ల్లో 52 వికెట్లు తీశాడు. చదవండి: ఐపీఎల్ 2021: బీసీసీఐ కీలక నిర్ణయం హార్దిక్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడానికి కారణం అదే.. : కోహ్లి -
‘నీకు ఐపీఎల్ ఆడటమే ముఖ్యమా రోహిత్?!’
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ వ్యవహారశైలిపై మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ విమర్శలు గుప్పించాడు. జాతీయ జట్టుకు ఆడటం కంటే, ఓ లీగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. అదే విధంగా రోహిత్ గాయాన్ని అంచనా వేయడంలో బీసీసీఐ ఫిజియో పొరబడ్డారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ.. తొడ కండరాల గాయంతో వరుసగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన బీసీసీఐ, గాయం కారణంగా అతడిని ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చినట్లు పేర్కొంది. అయితే ముంబై ప్రాక్టీస్ సెషన్స్‌లో రోహిత్ శ్రమిస్తున్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడం, అదే విధంగా అంతగా ప్రాధాన్యం లేని మంగళవారం నాటి మ్యాచ్ కోసం అతడు బరిలో దిగడం వంటి పరిణామాలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అంతేగాకుండా, మ్యాచ్‌కు ముందు ‘అంతా బాగుంది. నేను ఫిట్‌గా, చురుగ్గా కూడా ఉన్నాను’అంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలో దిలీప్ వెంగ్‌సర్కార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ఎంతో ముఖ్యమైన ఆటగాడు, అన్‌ఫిట్‌గా ఉన్నాడని భారత జట్టు ఫిజియో తేల్చిచెప్పిన కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాని క్రికెటర్ అయినటువంటి రోహిత్ శర్మ.. ఐపీఎల్లో ముంబైకి ఆడటమే కాదు, నాయకత్వం కూడా వహిస్తున్న విధానం అతడి ఆసక్తి ఏమిటన్న అంశాలను తేటతెల్లం చేస్తోంది. ఇండియాకు ఆడటం కంటే ఐపీఎల్‌కే అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడా? జాతీయ జట్టుకు ఆడటం కంటే ఓ క్లబ్ తరఫున ఆడటమే ముఖ్యం అని భావిస్తున్నాడా? ఈ విషయంపై బీసీసీఐ ఏవిధంగా స్పందిస్తుంది? లేదా రోహిత్ గాయాన్ని సరిగ్గా అంచనా వేయడంలో బీసీసీఐ ఫిజియో పొరబడ్డారా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’అని పేర్కొన్నాడు. ఇక ఒక్క లీగ్ కోసం భవిష్యత్తును పాడుచేసుకోవద్దంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే రోహిత్ శర్మకు సూచించిన విషయం తెలిసిందే. (చదవండి: రోహిత్... తొందరపడకు!) -
‘అవే గంభీర్ కొంప ముంచాయి’
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ చాలా ప్రతిభ కలిగిన ఆటగాడని, కీలక సమయాల్లో రాణించి టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడని కీర్తించాడు. అయితే మైదానం లోపల, వెలుపల కోపాన్ని, ఎమోషన్స్‌ను నియంత్రించుకోలేడని పేర్కొన్నాడు. ఒక వేళ తన పద్దతి మార్చుకొని ఉంటే టీమిండియా తరుపున మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా రెండు ప్రపంచకప్‌లు(టీ20, వన్డే) గెలవడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. టెస్టుల్లోనూ కొన్ని నెలల పాటు నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగాడు. టీమిండియా ఆగ్రశ్రేణి ఓపెనర్‌గా ఎదిగిన గంభీర్‌కు అతడి కోపం, ఎమోషన్సే కొంప ముంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో విరాట్ కోహ్లితో గొడవ, ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో వాగ్వాదం వంటివి గంభీర్ కెరీర్‌కు మచ్చగా మిగిలిపోయాయి. ఇక తాజాగా ఓ డిబేట్లో మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జట్టులో నుంచి తొలగించేముందు ఆటగాళ్లకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డాడు. తనతో పాటు యువీ, రైనా విషయంలో కూడా ఇలాగే జరిగిందని ప్రసాద్‌ను కడిగిపడేశాడు. 2003లో టీమిండియా తరుపున అరంగేట్రం చేసిన గంభీర్ 15 ఏళ్ల పాటు సుదీర్ఘ క్రికెట్ ఆడి 2018లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. చదవండి: నీకు.. 3డీ కామెంట్ అవసరమా?: గంభీర్ ‘ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి’ -
'ఫామ్‌లోనే ఉన్నా అయినా ఎంపిక చేయలేదు'
ముంబై : 2008 ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందానని భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. అప్పటి జట్టులో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం తాను పోటీలోనే ఉన్నానని తెలిపాడు. అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న తనను జట్టులోకి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.టీమిండియా మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్‌తో మంగళవారం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పార్థివ్ మాట్లాడాడు. ('అక్రమ్ అలా చేసుంటే అప్పుడే చంపేవాడిని') 'సరైన సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడం చాలా ముఖ్యం. 2008 ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ఎంపిక చేసే సమయంలో మొదటి వికెట్ కీపర్‌గా ధోనీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో నేను రెండో వికెట్ కీపర్ స్థానానికి పోటీలో నిలిచా. అయితే ఆ సమయంలో ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. అప్పటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్.. నాకు కాల్ చేసి.. నువ్వు మంచి ప్రదర్శన చేస్తున్నావు.. ఇలాగే కొనసాగించు అన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం నిన్ను ఎంపిక చేయడం లేదని పేర్కొన్నారని ' పార్థివ్ తెలిపాడు. 2008లో ఆసీస్ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. అయితే ఈ సిరీస్ మొత్తం వివాదాల నడుమే కొనసాగింది. సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో హర్బజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం క్రికెట్ ప్రేమికులెవరు అంత తొందరగా మరిచిపోలేరు. 2002లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన పార్థివ్ పటేల్ తన కెరీర్లో 25 టెస్టులు, 38 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పిన్నవయస్కుడిగా (17ఏండ్ల 153రోజులు) వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు పాకిస్తాన్ వికెట్ కీపర్ హనీఫ్ మహ్మద్(17 ఏళ్ల 300 రోజులు) పేరిట ఉండేది. ('నా తమ్ముడు అప్పుడు.. ఇప్పుడు ఏం మారలేదు') -
రాహుల్‌కే నా ఓటు: మాజీ ఛీఫ్ సెలక్టర్
ముంబై: ఇంగ్లండ్ వేల్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని టీమిండియా మాజీ ఛీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి సేన ప్రపంచకప్‌లో సత్తా చాటుతుందన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులతో పాటు రాహుల్ టెక్నిక్ దృష్ట్యా నంబర్ 4లో అతన్ని బరిలోకి దించే విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ పరిశీలించాలన్నాడు. గత కొన్నాళ్లుగా నాలుగో స్థానంలో ఆడిన తెలుగు తేజం రాయుడు ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. దీంతో భారత క్రికెట్ వర్గాల్లో అందరి చర్చ నాలుగో స్థానం చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ మీడియాతో మాట్లాడుతూ ‘ధావన్, రోహిత్ శర్మల రూపంలో మనకు స్థిరమైన ఓపెనింగ్ జోడీ అందుబాటులో ఉంది. ఇక కోహ్లి మూడో స్థానంలో దిగుతాడు. దీంతో నంబర్ 4 కోసం విజయ్ శంకర్ బదులు డాషింగ్ బ్యాట్స్‌మన్ రాహుల్‌ను పరిశీ లించాలి. బ్యాటింగ్‌లో అతని సాంకేతికత, ఆటతీరులో నిలకడ జట్టుకు ఉప యోగపడుతుంది’ అని అన్నాడు. 1979, 1983,1987లలో మూడు ప్రపంచకప్‌లు ఆడిన ఈ మాజీ దిగ్గజం... రెండు ప్రపంచకప్‌లు ఇంగ్లండ్‌లోనే ఆడాడు. స్పెషలిస్ట్ ఓపెనర్ అయిన రాహుల్‌కు ఆరంభంలో వికెట్లు కోల్పోతే జట్టును ఆదుకునే సామర్థ్యం ఉందని, పైగా సుదీర్ఘమైన ఈ వన్డే ప్రపంచకప్‌లో అతన్ని అవసరమైతే ఓపెనింగ్‌లోనూ దించవచ్చని సూచించాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో 593 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచిన అతనికి తప్పకుండా తుది జట్టులో అవకాశమివ్వాలన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌లో పర్యటించిన అనుభవం భారత జట్టుకు దోహదం చేయగలదని ఈ 63 ఏళ్ల దిగ్గజ ఆటగాడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో రాణించలేకపోయిన స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు తమ బౌలింగ్‌ను మెరుగు పర్చుకోవాలన్నారు. త్వరలో జరిగే ప్రపంచకప్‌లో భారత్, ఆతిథ్య ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్ చేరతాయని, మరో జట్టుపై ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. -
‘వరల్డ్‌కప్ గెలిచేందుకు మనకు మంచి చాన్స్’
ముంబై: మరొకసారి వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచేందుకు టీమిండియా ముందు సువర్ణావకాశం ఉందని మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగసర్కార్ పేర్కొన్నాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టును బట్టి చూస్తే విరాట్ కోహ్లి అండ్ గ్యాంగ్‌కు కప్‌ను అందుకునేందుకు మంచి చాన్స్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ‘ వరల్డ్‌కప్‌ను గెలిచేందుకు భారత క్రికెట్ జట్టుకు ఇదొక అద్భుతమైన అవకాశం. మన జట్టు కచ్చితంగా టాప్-4 జట్లలో ఉంటుంది. కానీ ఫైనల్‌ను ఎలా ఉంటున్నది నేను మాత్రం చెప్పలేను. ప్రస్తుతం ఉన్న జట్టు బలాన్ని బట్టి పోల్చుకుంటే వరల్డ్‌కప్‌ను గెలవడానికి చాన్స్‌లు మనకే ఉన్నాయి. భారత క్రికెటర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. వారికి సక్సెస్ చేకూరాలని ముందుగానే వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని వెంగీ తెలిపాడు. ఇక ముంబై ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) గురించి మాట్లాడుతూ.. ‘ యువ క్రికెటర్లకు ఇదొక చక్కటి వేదిక. త్వరలో రెండో సీజన్లోకి అడుగుపెట్టబోతున్న ఈ లీగ్‌లో దాదాపు 160 ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో తొలి సీజన్లో ఆకట్టుకున్న వాళ్లు ఐపీఎల్లో చాన్స్ దొరకబుచ్చుకున్నారు. గత సీజన్లో ఎంపీఎల్లో మెరుగ్గా ఆడిన శివం దూబే.. ఈసారి ఐపీఎల్లో స్థానం దక్కించుకున్నాడు. కచ్చితంగా ఈ లీగ్ యువ క్రికెటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని వెంగీ తెలిపాడు. -
కోహ్లి.. నీకు అక్కడ ఫీల్డింగ్ అవసరమా?
న్యూఢిల్లీ: క్రికెట్లో కెప్టెన్ అనేవాడు ఎప్పుడూ బౌలర్లు వేసే బంతుల్ని బట్టి ఎప్పటికప్పుడు ఫీల్డింగ్ సెట్ చేయాల్సి వుంటుందని ఆ విషయాన్ని టీమిండియా సారథి విరాట్ కోహ్లి గుర్తిసే బాగుంటుందని మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ సూచించాడు. ఇటీవల కాలంలో కోహ్లి తరచు ‘డీప్’లో ఫీల్డింగ్ చేస్తూ ఉండటాన్ని వెంగసర్కార్ తప్పుబట్టాడు. అసలు ఒక కెప్టెన్ అయి ఉండి డీప్‌లో ఫీల్డింగ్ ఎలా చేస్తావంటూ ప్రశ్నించాడు. జట్టు కెప్టెన్ ఎప్పుడూ ఇన్నర్ సర్కిల్లోనే ఫీల్డింగ్ చేస్తే పరిస్థితుల్ని ఫీల్డర్లను సెట్ చేసే అవకాశం ఉంటుందని, అలా కాకుండా ఎక్కడో డీప్‌లో ఉంటే ఫీల్డింగ్‌ను పెట్టలేమన్నాడు. అలా ఉంటే అతనికి సరైన సహకారం లభించే అవకాశమే ఉండదన్నాడు. కేవలం చివరి ఓవర్లలో మాత్రమే డీప్‌లో ఫీల్డింగ్ చేస్తే తప్పులేదు కానీ, మ్యాచ్ ఆరంభం నుంచి ఆ స్థానంలో కెప్టెన్ ఫీల్డింగ్ చేస్తూ ఫీల్డర్లను మోహరించడమనేది చాలా కష్టమన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో కోహ్లి నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడన్న కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలతో వెంగసర్కార్ ఏకీభవించాడు. అది ఒక మంచి నిర్ణయంగానే పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌లో కొన్ని సందర్బాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉండవని, అటువంటి తరుణంలో ఆరంభంలోనే వికెట్లను చేజార్చుకుంటే నాల్గో స్థానంలో కోహ్లిని పంపడం లాభిస్తుందన్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన కోహ్లి.. మంచి ఫామ్‌లో ఉండటం కూడా కలిసొస్తుందనన్నాడు. కాకపోతే కోహ్లిపైనే భారత జట్టు మొత్తం ఆధారపడటం ఎంతమాత్రం తగదనే విషయం మేనేజ్మెంట్ గుర్తించాలన్నాడు. మిగతా వారి నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభిస్తేనే ఇంగ్లండ్ పిచ్‌లపై రాణించగలమన్నాడు. వచ్చే వరల్డ్‌కప్‌లో ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించడం ఖాయమని వెంగీ పేర్కొన్నాడు. -
'కోహ్లి వల్లే నా పదవి పీకేశారు'
న్యూఢిల్లీ:దాదాపు పదేళ్ల క్రితం విరాట్ కోహ్లిని భారత జట్టులో ఎంపిక చేయడం వల్ల తన చీఫ్ సెలక్టర్ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిందంటూ భారత దిగ్గజ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లిని ఎంపిక చేయడమనేది బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అప్పటి బీసీసీఐ కోశాధికారిగా ఉన్న ఎన్ శ్రీనివాసన్‌కు నచ్చని కారణంగానే చీఫ్ సెలక్టర్ పదవిని కోల్పోవల్సి వచ్చిందని తాజాగా స్పష్టం చేశాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో తమిళనాడు ఆటగాడు ఎస్ బద్రీనాథ్‌ను తప్పించి కోహ్లిని ఎంపిక చేయడంతో శ్రీనివాసన్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నాడు. '2008లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌ను కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు గెలుచుకుంది. ఆ క్రమంలోనే ముందుగా ఆ ఏడాది శ్రీలంక పర్యటనకు కోహ్లిని భారత సీనియర్ క్రికెట్ జట్టులోకి తీసుకున్నాం. అదే సమయంలో బద్రీనాథ్ కూడా వన్డే అరంగేట్రం చేశాడు. లంకేయులతో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో బద్రీనాథ్‌ను అరంగేట్రం జరిగింది. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన బద్రీనాథ్ (27 నాటౌట్, 6, 6) తీవ్రంగా నిరాశపరిచాడు. అదే సిరీస్‌లో కోహ్లి ఐదు మ్యాచ్‌లు ఆడాడు. తొలి మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన కోహ్లి.. రెండో వన్డేలో 37 పరుగులు చేశాడు. ఇక మూడో వన్డేలో 25 పరుగులు చేయగా, నాల్గో వన్డేలో 54 పరుగులు, ఐదో వన్డేలో 31 పరుగులు చేశాడు. దాంతో ఆపై ఆసీస్ పర్యటనకు బద్రీనాథ్‌ను పక్కకు పెట్టి కోహ్లిని ప్రాముఖ్యత నిచ్చాం. ఇది నా చీఫ్ సెలక్టర్ పదవికి ఎసరు పెట్టింది. బద్రీనాథ్‌పై ఎందుకు వేటు వేయాల్సి వచ్చిందంటూ శ్రీని నన్ను ప్రశ్నించారు. దానికి నేను విరాట్‌ను వెనుకేసుకొచ్చా. విరాట్‌లో ఒక అసాధారణ ఆటగాడ్ని నేను చూశా. అందుకే అతన్ని ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయడానికి కారణమని చెప్పా. దాంతో నాకు, శ్రీనికి వాగ్వాదం జరిగింది. ఆ సీజన్లో తమిళనాడు తరపున 800 పరుగులు చేసిన ఆటగాడ్ని ఎలా తప్పిస్తారు అని ప్రశ్నించారు. అతనికి మరొక చాన్స్ ఇద్దామని శ్రీనికి నేను సర్దిచెప్పే యత్నం చేశా. ఇంకా ఎప్పుడు చాన్స్ ఇస్తావు. అతనికి ఇప్పటికే 29 ఏళ్లు అని నిలదీశారు. దానికి నేను చాన్స్ ఇద్దామని చెప్పాను కానీ, ఎప్పుడు అనేది చెప్పలేకపోయా. ఆ మరుసటి రోజు నా చీఫ్ సెలక్టర్ పదవి ముగిసిపోయిందని చెప్పారు. కృష్టమాచారి శ్రీకాంత్‌కు సెలక్షన కమిటీ చీఫ్ బాధ్యతలు అప్పచెప్పారు. అయితే శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత నాకు మళ్లీ సెలక్షన్ కమిటీలో చోటు దక్కింది' అని వెంగీ తెలిపారు. 2006లో తొలిసారి దిలీప్ వెంగసర్కార్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలక్టర్ బాధ్యతలు చేపట్టారు. భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే నుంచి వెంగీసర్కార్ ఆ పదవిని స్వీకరించిన వెంగీ.. రెండేళ్ల తర్వాత ఆ పదవికి ఉన్నపళంగా గుడ్ బై చెప్పారు. ఆపై 2011లో తిరిగి మరోసారి బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా వెంగ్ సర్కార్ ఎంపికయ్యారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ మద్దతుతో వెంగీ మరోసారి సెలక్షన్ కమిటీ బాధ్యతలు చేపట్టారు. -
వెంగసర్కార్ గుడ్ బై
ముంబై:భారత మాజీ దిగ్గజ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. లోధా ప్యానల్ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ ఈనెల రెండో తేదీన సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఎంసీఏ ఉపాధ్యక్ష పదవిని నుంచి వెంగసర్కార్ వైదొలిగారు. ఈ విషయాన్ని తాజాగా ఎంసీఏకు లేఖ రూపంలో వెంగీ తెలియజేశారు. ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ తప్పుకున్న సంగతి తెలిసిందే. 70 ఏళ్లకు పైబడిన వారు క్రికెట్ పరిపాలన వ్యవహారాలు చూసేందుకు దూరంగా ఉండాలంటే లోధా కమిటీ సూచించిన క్రమంలో పవార్ ఆ పదవిని గతేడాది డిసెంబర్ 17వ తేదీన వదులుకున్నారు. గతంలో ముంబై వైస్ ప్రెసిడెంట్‌గా దిలీప్ వెంగసర్కార్ రెండు సార్లు సేవలందించారు. 2002 నుంచి 2010 మధ్యకాలంలో వెంగసర్కార్క్ ఎంసీఏ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. దాంతో ప్రస్తుత ఉపాధ్యక్ష పదవిని వెంగసర్కార్ వదులుకోవాల్సి వచ్చింది. క్రికెట్ సమూల ప్రక్షాళనకు ఉద్దేశించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బీసీసీఐలో, దాని అనుబంధ యూనిట్లలోని బాధ్యులు, అధికారులకు వయస్సు పరిమితి, కాలపరిమితి ఉండాలని లోధా కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫారులకు సుప్రీంకోర్టు ఆమోద ముద్రవేయడంతో వెంగసర్కార్ తన పదవికి రాజీనామా చేశారు. -
డీఆర్ఎస్ కు వెంగసర్కార్ మద్దతు
ముంబై:నిర్ణయ సమీక్ష పద్దతి(డీఆర్ఎస్)ను బీసీసీఐ వ్యతిరేకించగా.. భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగసర్కార్ మాత్రం ఆ పద్దతిని వెనకేసుకొచ్చాడు. టెస్టుల్లో ఆ విధానాన్ని అవలంభించడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నాడు. డీఆర్ఎస్ విధానం 100 శాతం కరెక్టు అని చెప్పకపోయినా.. ఈ సిరీస్ లో అంపైర్లు తీసుకునే తప్పుడు నిర్ణయాల కంటే ఇదే నయయన్నాడు. దీంతో మనం అంతా డీఆర్ఎస్ ను అంగీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. శుక్రవారం రచయిత మకరంద వాయింగన్ కర్ పుస్తక విడుదల కార్యక్రమానికి హాజరైన వెంగీ.. పై విధంగా స్పందించాడు. తొలి రెండు టెస్టుల్లో భారత ఆటగాళ్లు అజ్యింకా రహానే, చటేశ్వర పూజారాలు అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు అవుట్ కావడంతో డీఆర్ఎస్ విధానాన్ని వెంగీ తాజాగా తెరపైకి తీసుకొచ్చాడు. -
వెంగ్‌సర్కార్‌కు ‘జీవితకాల సాఫల్య’ పురస్కారం
ఉత్తమ క్రికెటర్‌గా భువనేశ్వర్ బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రకటన ముంబై: ప్రతిష్టాత్మక ‘కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య’ పురస్కారం... ఈసారి భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌కు దక్కింది. మంగళవారం ప్రకటించిన బీసీసీఐ వార్షిక అవార్డుల్లో పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఉత్తమ అంతర్జాతీయ భారత క్రికెటర్ (పాలి ఉమ్రిగర్ ట్రోఫీ)గా ఎంపికయ్యాడు. ఈనెల 21న ముంబైలో ఈ అవార్డులను విజేతలకు అందజేస్తారు. 1976 నుంచి 1991 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించిన వెంగ్‌సర్కార్ పేరును శేఖర్ గుప్తా (మీడియా), శివలాల్ యాదవ్ (బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు), సంజయ్ పటేల్ (కార్యదర్శి)లతో కూడిన కమిటీ ప్రతిపాదించింది. ఈ అవార్డు కింద రూ. 25 లక్షల నగదు, ప్రశంసా పత్రం, ప్రతిమను బహుకరించనున్నారు. భువనేశ్వర్‌కు రూ. 5 లక్షల నగదు, ప్రశంసా పత్రం, ప్రతిమను అందజేయనున్నారు. ఇతర అవార్డుల విజేతలు రంజీల్లో ఉత్తమ ఆల్‌రౌండర్ (లాలా అమర్నాథ్ అవార్డు) : పర్వేజ్ రసూల్ వన్డేల్లో ఉత్తమ ఆల్‌రౌండర్ (లాలా అమర్నాథ్ అవార్డు): ఆర్. వినయ్ కుమార్ రంజీల్లో అత్యధిక స్కోరు (మాధవరావు సింధియా అవార్డు) : కేదార్ జాదవ్ రంజీల్లో అత్యధిక వికెట్లు (మాధవరావు సింధియా అవార్డు) : రిషీ ధావన్ ఉత్తమ అండర్-25 క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) : రాహుల్ త్రిపాఠి ఉత్తమ అండర్-19 క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) : అనిరుధ్ ఉత్తమ అండర్-16 క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) : శుభమ్ గిల్లా ఉత్తమ జూనియర్ మహిళా క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) : స్మృతి మందన దేశవాళీ ఉత్తమ అంపైర్ : అనిల్ చౌదరి అనిరుధ్ అదుర్స్ సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అవార్డుల్లో అండర్-19 అత్యుత్తమ ఆటగాడిగా హైదరాబాద్‌కు చెందిన బాలచందర్ అనిరుధ్ ఎంపికయ్యాడు. 2013-14 సీజన్లో కూచ్ బెహర్ ట్రోఫీలో 11 ఇన్నింగ్స్‌లో అతను 909 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 232. చెన్నైలో పుట్టిన అనిరుధ్ హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ అకాడమీలోనే క్రికెట్ నేర్చుకున్నాడు. హైదరాబాద్ తరఫున అండర్-13, అండర్-16, అండర్-19, అండర్-22, అండర్-25 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సంవత్సరం అండర్-19 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు ప్రాబబుల్స్‌లో కూడా తను ఉన్నాడు. ఈ సీజన్లో రెండు నెలల పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో (ఎన్సీఏ)లో బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక శిక్షణా శిబిరానికి కూడా అనిరుధ్ హాజరయ్యాడు గత ఏడాది హైదరాబాద్ సీనియర్ వన్డే, టి20 జట్లకు ఎంపికైనా... తుది జట్టులో అవకాశం రాలేదు. ‘నేను అవార్డుకు ఎంపికైనట్లు బీసీసీఐనుంచి సోమవారం సమాచారం అందింది. అండర్-19లో టాప్ స్కోరర్‌కు అవార్డు ఇస్తారని తెలుసు. నేను చేసిన పరుగులు తెలుసు కాబట్టి నాకే వస్తుందని ఊహించాను. దీనికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో నేను మరింతగా రాణించేందుకు ఇది ప్రోత్సాహకంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఈ సీజన్లో హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. తుది జట్టులో చోటు లభిస్తే సత్తా చాటుతా’ - ‘సాక్షి'తో అనిరుధ్ -
వెంగసర్కార్ కు సీకే నాయుడు పురస్కారం
ముంబై: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగసర్కార్- కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. బీసీసీఐ 8వ వార్షిక అవార్డులను మంగళవారం ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్, కార్యదర్శి సంజయ్ పటేల్ తో కూడిన కమిటీ వెంగసర్కార్ ను అవార్డుకు ఎంపిక చేసింది. పురస్కారం కింద ప్రశంసాపత్రం, జ్ఞాపిక, రూ. 25 లక్షల నగదు అందజేయనున్నారు. 58 ఏళ్ల వెంగసర్కార్ 1976 నుంచి 1991 వరకు భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. భువనేశ్వర్ కుమార్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డుకు ఎంపికయ్యాడు. నవంబర్ 21న అవార్డులు ప్రదానం చేయనున్నారు.