టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరున్నది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఇద్దరి పేర్లను కెప్టెన్‌గా సూచించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లను ఎంపిక చేశాడు. కాగా ఇప్పటికే రోహిత్ ఇప్పటికే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను చెపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు, అశ్విన్ ఇప్పటివరకు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించలేదు.
"ప్రస్తుతానికి రోహిత్‌శర్మ లేక రవి అశ్విన్ భారత టెస్ట్ కప్టెన్సీ భాధ్యతలు అప్పజెప్పాలి. అనంతరం ఒక ఏడాది కాలం సమయం తీసుకుని కొత్త సారథిని ఎంపికచేస్తే బాగుంటుంది అని అతడు పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇలాంటి పరిస్థితిలో కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ సమయంలో భారత ప్రధాన సెలక్టర్‌గా వెంగ్‌సర్కార్.. సెలక్షన్ కమిటీ ఎదుర్కొన్న పరిస్ధితులను ఆయన గుర్తు చేసుకున్నారు.
"ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు నేను, నా కమిటీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొకున్నాం. అంతేకాకుండా ఈ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు వెల్ల వలసింది ఉంది. అప్పటికే పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్ ధోని పదోన్నతి లభిస్తుందని కొందరు భావించారు, అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అనిల్ కుంబ్లేను టెస్టులకు సారధిగా ఎంపిక చేశాం" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Ind Vs Sa 1st ODI: ధావన్‌కు షాక్... ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్!
Comments
Please login to add a commentAdd a comment