విరాట్ కోహ్లి కెప్టెన్సీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తప్పించి రోహిత్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంత మంది తప్పుపడుతుంటే, కొంత మంది సమర్ధిస్తున్నారు. ఈ క్రమంలో సెలక్షన్ కమిటీ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ జోక్యం చేసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ మండిపడ్డారు. "గంగూలీకి సెలక్షన్ కమిటీ తరపున మాట్లాడే హక్కు లేదు. అతడు బీసీసీఐ అధ్యక్షుడు, అతడికి సెలక్షన్ కమిటీలో జోక్యం చేసుకోనే అవసరం లేదు. జట్టు సెలెక్షన్ లేదా కెప్టెన్సీ గురించి ఏదైనా సమస్య ఉంటే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ మాట్లాడాలి.
ఈ విషయం ముందే గంగూలీకి తెలుసు. టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి.. విరాట్ వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. సెలక్షన్ కమిటీ ద్వారా కెప్టెన్‌ని ఎంపిక చేస్తారు లేదా తొలగిస్తారు. అది గంగూలీ అధికార పరిధి కాదు. 1932 నుంచి (తొలి భారత జట్టు ఎంపికైనప్పటి నుంచి) ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు మారాలి. కోహ్లి భారత క్రికెట్ కోసం చాలా కష్టపడ్డాడు. అతడి పట్ల మీరు వ్యవహరించిన తీరు సరైనదికాదు. అది కచ్చితంగా కోహ్లిని బాధించి ఉంటుంది" అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నారు.
చదవండి: Ashes 2021-22: "ఇంగ్లండ్ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. రూట్ వద్దే వద్దు"
Comments
Please login to add a commentAdd a comment