టీమిండియా బెంచ్ పటిష్టంగా ఉందని.. .. గాయాల వల్ల భారత జట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని న్యూజిలాండ్ హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు. కీలక ఆటగాళ్లు లేకపోయినా ప్రత్యర్థి జట్టుకు గట్టి సవాలు విసరగల సత్తా రోహిత్ సేనకు ఉందని ప్రశంసించాడు. ముఖ్యంగా టెస్టుల్లో భారత్‌కు ఎన్నో అత్యుత్తమ ఆప్షన్లు ఉండటం సానుకూల అంశమని పేర్కొన్నాడు.
టీమిండియాకు పెద్దగా ఇబ్బంది ఉండదు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య అక్టోబరు 16(బుధవారం) నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో కివీస్ ప్రధాన కోచ్ గ్యారీ స్టడ్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా.. ‘‘గాయాల వల్ల ఆటగాళ్లు దూరమైతే.. మిగతా జట్ల లాగా టీమిండియాకు పెద్దగా ఇబ్బంది ఉండదు.
ఒక్క ఆటగాడు దూరమైతే అతడి స్థానంలో అంతే నైపుణ్యం గల మరొక ఆటగాడు వస్తాడు. టీమిండియా తగినన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో నైపుణ్యం, అనుభవం గల ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. టీమిండియా బ్రాండ్ క్రికెట్ వల్ల పర్యాటక జట్లకే ఎల్లప్పుడూ ఇబ్బంది.
మాకు కఠిన సవాలు
మాకు ఇక్కడ కఠిన సవాలు ఎదురుకాబోతోంది. అయితే, అత్యుత్తమ ఆట తీరుతో దానిని మేము అధిగమిస్తాం. ఉత్తమ తుదిజట్టుతో బరిలోకి దిగి అనుకున్న ఫలితాలు రాబడతాము. వైఫల్యాలు దాటుకుని.. గొప్పగా ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు.
కాగా టీమిండియా ఇటీవల బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి జోరు మీద ఉండగా.. న్యూజిలాండ్ మాత్రం శ్రీలంక చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఇదిలా ఉంటే.. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఇంకా అందుబాటులోకి రాలేదు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ కివీస్ సిరీస్‌కూ దూరంగానే ఉండనున్నాడు.
చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే!
Comments
Please login to add a commentAdd a comment