అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. గిల్ (67), శ్రేయస్ (6) పరుగులతో ఆడుతున్నారు.
👉ఇషాన్ కిషన్ (34) రూపంలో టీమిండియా 116 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
హాఫ్ సెంచరీ బాదిన గిల్
అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 37 బంతుల్లో గిల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది.
👉10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30), గిల్ (29) పరుగులతో ఆడుతున్నారు.
రోహిత్ శర్మ రనౌట్.. తొలి వికెట్ డౌన్
రోహిత్ శర్మ రనౌట్ కావడంతో టీమిండియా 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
దూకుడుగా ఆడుతున్న టీమిండియా
195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15), శుబ్‌మన్ గిల్ (17) పరుగులతో ఆడుతున్నారు.
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు.
ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్
16.3: హర్ష్ దూబే బౌలింగ్‌లో హష్మతుల్లా (27) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. హర్ష్‌కు వన్డేల్లో ఇదే తొలి వికెట్. నబీ క్రీజులోకి రాగా.. అజ్మతుల్లా రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 144-5(16.5).
నాలుగో వికెట్ డౌన్
15.3: నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో బౌల్డ్ అయిన రహ్మానుల్లా గుర్బాజ్. 51 బంతుల్లో 102 పరుగులు చేసి నిష్క్రమణ. స్కోరు: 143-4(16). హష్మతుల్లా 27, అజ్మతుల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.
శతక్కొట్టిన రహ్మానుల్లా గుర్బాజ్
48 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అఫ్గనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్
👉14 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 130-3
సెంచరీకి చేరువైన రహ్మానుల్లా గుర్బాజ్
సెంచరీ కొట్టిన అఫ్గనిస్తాన్.. స్కోరు: 110-3(12)
హష్మతుల్లా 17, రహ్మానుల్లా గుర్బాజ్ 86 పరుగులతో ఉన్నారు.
రహ్మానుల్లాగుర్బాజ్ హాఫ్ సెంచరీ
👉10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకుని.. అఫ్గన్ తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.
ఆరు ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 35-3 (6)
రహ్మానుల్లా 25 పరుగులతో ఉండగా.. హష్మతుల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్
4.3: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటైన రహ్మత్ షా (3). క్రీజులోకి హష్మతుల్లా షాహిది. రహ్మానుల్లా 20 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 26-3(4.4).
రెండో వికెట్ డౌన్
2.3: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన సెదీకుల్లా (0). అంపైర్ అవుట్ ఇవ్వగా.. అఫ్గన్ రివ్యూకు వెళ్లింది. అయితే, ఎల్బీడబ్ల్యూగా తేలడంతో సెదీకుల్లా మైదానం వీడాడు. రహ్మత్ షా క్రీజులోకి రాగా.. రహ్మానుల్లా 14 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 17-2(2.4)
తొలి వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్
గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన ఇబ్రహీం జద్రాన్ (1). స్కోరు: 13-1(1.5). క్రీజులోకి సెదీకుల్లా రాగా.. రహ్మానుల్లా 11 పరుగులతో ఉన్నాడు.
👉టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత బౌలింగ్
👉టీమిండియా తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రం
తుదిజట్లు
భారత్
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
అఫ్గనిస్తాన్
ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్‌ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.
శుభవార్త
వర్షం తగ్గుముఖం పట్టింది. సూర్యుడు మేఘాల మాటు నుంచి బయటకు వచ్చాడు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసేసి మాప్ చేస్తున్నారు. 5.45 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ వన్డే మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్‌ప్లే ఐదు ఓవర్లు ఉంటుంది. ఐదుగురు బౌలర్లు తలా ఐదు ఓవర్లు బౌల్ చేస్తారు.
👉4.45PM: తగ్గుముఖం పట్టిన వాన.. మైదానంలోకి వచ్చిన గ్రౌండ్ సిబ్బంది.
👉కొనసాగుతున్న చిరుజల్లులు
👉మరోసారి భారీగా కురుస్తున్న వర్షం. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు కటాఫ్ టైమ్ సాయంత్రం 6.32 గంటలు.
మ్యాచ్ జరిగేనా?
👉తగ్గుముఖం పట్టిన వాన
వరుణుడు కరుణిస్తాడా?
👉కొనసాగుతున్న జల్లులు
👉మైదానంలోకి వచ్చి పరిశీలించిన హెడ్ క్యూరేటర్.. వాన తెరిపినిస్తేనే కవర్లు ఎత్తివేసే అవకాశం
వాన మొదలు
👉🌧️ధర్మశాలలో మొదలైన వాన
👉రన్-అప్ ఏరియాపై కవర్లు కప్పిన సిబ్బంది
టాస్ ఆలస్యం
క్రికెట్ అభిమానులకు చేదు వార్త. టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ధర్మశాలలో వాతావరణం మేఘావృతం కావడంతో టాస్ ఆలస్యం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ధర్మశాలలో వాన పడేందుకు 60- 70 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తుదిజట్ల అంచనా
భారత్
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్.
అఫ్గనిస్తాన్
రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదీకుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇక్రమ్ అలికిల్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్‌ఫర్, బిలామ్ సమీ/మహ్మద్ సలీం.


