
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై మూడో టీ20లో గెలుపుతో హిట్‌మ్యాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. పొట్టి క్రికెట్‌లో 250 విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టీ20లతో పాటు ఐపీఎల్ లాంటి పొట్టి ఫార్మాట్ టోర్నీల్లో పాల్గొన్న రోహిత్.. 390 పైచిలుకు మ్యాచ్‌ల్లో ఈ ఘతన సాధించాడు.
రోహిత్ తర్వాత అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. ధోని 220 టీ20 విజయాల్లో భాగమయ్యాడు. ఈ జాబితాలో రోహిత్, ధోనిల తర్వాత దినేశ్ కార్తీక్ (218), సురేశ్ రైనా (207), విరాట్ కోహ్లి (198) ఉన్నారు.
Rohit Sharma Became the First Indian Cricketer to Achieve 250 Wins in T20 Cricket.#RohitSharma pic.twitter.com/dgUgRMyaln
— Sportiqo (@sportiqomarket) January 18, 2024
ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో విరుచుకుపడిన రోహిత్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా (1648), అత్యధిక వ్యక్తిగత స్కోర్ (121) సాధించిన భారత కెప్టెన్‌గా, టీ20ల్లో అత్యధిక విజయాలు (42) సాధించిన భారత్ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డులు నెలకొల్పాడు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్‌పై మూడో టీ20లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.
తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్‌లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment