Rohit Sharma Beats Virat Kohli, Creates Record With Most Fifty Plus Scores In T20I - Sakshi
Sakshi News home page

Rohit Sharma: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. కోహ్లిని దాటేశాడు..

Published Mon, Nov 22 2021 10:04 AM | Last Updated on Mon, Nov 22 2021 11:53 AM

Rohit Sharma breaks Virat Kohlis record with most fifty plus scores in T20 Internationals - Sakshi

Rohit Sharma breaks Virat Kohlis record with most fifty plus scores in T20 Internationals: టీ20 క్రికెట్‌లో రోహిత్‌ శర్మ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు  50కుపైగా పరుగులు చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. ఈడెన్‌ గార్డన్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 56 పరుగులు చేసిన రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. అంతకముందు టీ20ల్లో విరాట్‌ కోహ్లి 29 సార్లు యాభైకు పైగా పరుగులు చేయగా, తాజాగా రోహిత్‌ 30 సార్లు సాధించి అతడి రికార్డును అధిగమించాడు.

రోహిత్‌ 119 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. రెండో స్ధానంలో కోహ్లి ఉండగా, మూడో స్థానంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఉన్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. నవంబర్‌21న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 

చదవండి: Viral Video: సోధి సింగిల్‌ హ్యాండ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. రోహిత్‌ శర్మ షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement