
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. భారత గడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్ర సృష్టించారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానం ఆక్రమించారు.
కాగా రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో గురువారం మొదలైన టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఆదిలోనే రోహిత్ సేనకు షాకిచ్చాడు.
తొలుత ఓపెనర్ యశస్వి జైస్వాల్(10)ను పెవిలియన్‌కు పంపిన వుడ్.. తర్వాత శుబ్‌మన్ గిల్(0)ను డకౌట్ చేశాడు. అనంతరం స్పిన్నర్ టామ్ హార్లే రజత్ పాటిదార్(5)ను వెనక్కి పంపాడు. ఈ క్రమంలో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ రవీంద్ర జడేజా.. రోహిత్ శర్మకు జతయ్యాడు.
ఇద్దరూ కలిసి చక్కటి సమన్వయంతో ముందుకు సాగుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలో రోహిత్- జడేజా నాలుగో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక రోహిత్ 131 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్ వుడ్ బౌలింగ్‌లో వెనుదిరగగా.. జడేజా సెంచరీ చేసి
ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఓవరాల్‌గా నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టీమిండియా జోడీలు
►249 రన్స్- సచిన్ టెండుల్కర్- సౌరవ్ గంగూలీ- 2002- హెడింగ్లీ
►222 రన్స్- విజయ్ మంజ్రేకర్- విజయ్ హజారే- 1952- హెడింగ్లీ
►204 రన్స్- రోహిత్ శర్మ- రవీంద్ర జడేజా- 2024- రాజ్‌కోట్(సొంతగడ్డపై ఇదే అత్యధికం)
►190 రన్స్- మహ్మద్ అజారుద్దీన్- మొహిందర్ అమర్నాథ్- 1985- చెన్నై
►189 రన్స్- మహ్మద్ అజారుద్దీన్- సంజయ్ మంజ్రేకర్- 1990- ఓల్డ్ ట్రఫోర్డ్.
చదవండి: Virat Kohli: ఇషాన్ డుమ్మా.. కోహ్లి సెలవులపై జై షా కీలక వ్యాఖ్యలు