
వెల్లింగ్టన్: టి20 ప్రపంచకప్ ముగిసి వారం రోజులు కూడా కాలేదు. గత గురువారమే సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడి భారత్ నిష్క్రమించింది. అయితే 2024లో జరిగే టి20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే జట్టు సన్నాహాలు మొదలు పెట్టినట్లు, అందుకు తగిన ప్రణాళికలు తమ వద్ద ఉన్నట్లు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు. రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోవడంతో శుక్రవారం నుంచి విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్‌కు పాండ్యా భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
‘మా ప్రపంచకప్ నిరాశాజనకంగా ముగిసిందనేది వాస్తవం. అయితే ప్రొఫెషనల్ క్రీడాకారులుగా మేం దానిని అధిగమించి ముందుకు సాగాలి. మా వద్ద ఇప్పుడు తగినంత సమయం ఉంది. వచ్చే రెండేళ్లలో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు. చాలా మ్యాచ్‌లు ఆడతాం కాబట్టి చాలా మందికి తగిన అవకాశాలు కూడా లభిస్తాయి. సరిగ్గా చెప్పాలంటే దాని కోసం మా వద్ద ప్రణాళిక లు సిద్ధంగా ఉన్నాయి’ అని హార్దిక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment