ఇండోర్: ఆస్ట్రేలియాపై సిరీస్ సొంతమైంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కింది. ఇక శనివారం ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరేముందు మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే రెండు సిరీస్‌లు సాధించినా, ఒక ప్రధాన సమస్య మాత్రం జట్టును ఇంకా ఇబ్బంది పెడుతోంది. అదే పేస్ బౌలింగ్ పేలవ ప్రదర్శన. మెగా ఈవెంట్‌కు ముందు మిగిలిన ఆఖరి పోరులో భారత టీమ్ మేనేజ్‌మెంట్ దానిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుందా అనేదే భారత్ కోణంలో కీలక అంశం. మరోవైపు క్లీన్‌స్వీప్‌నకు గురి కాకుండా చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని సఫారీ టీమ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఇరు జట్లు చివరి టి20 మ్యాచ్‌లో ఆడనున్నాయి.
షహబాజ్‌కు చాన్స్!
చివరి టి20 మ్యాచ్ కోసం భారత జట్టు ఇద్దరు బ్యాటర్లు కోహ్లి, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతినిచ్చి ంది. ఈ రెండు స్థానాలు మినహా ఇతర జట్టులో భారత్ ఎలాంటి మార్పు చేసే అవకాశం లేదు. కోహ్లి దూరం కావడంతో స్టాండ్‌బైలో ఉన్న ఏకైక బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు తుది జట్టులో స్థానం లభించనుంది. మరో ప్రత్యామ్నాయ బ్యాటర్ లేడు కాబట్టి ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. బౌలింగ్ విషయంలో భారత్ వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది కీలకం. దీపక్ చహర్, అర్‡్షదీప్, అక్షర్, అశ్విన్ ఖాయం కాగా... హర్షల్‌కు బదులుగా సిరాజ్ రూపంలో ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంది. అయితే వరల్డ్‌కప్ జట్టులో ఉన్న హర్షల్ ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు కాబట్టి అతడికే మరో అవకాశం ఇవ్వడమే మంచిదని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన.
IND vs SA 2nd T20: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
Published Tue, Oct 4 2022 5:23 AM | Last Updated on Tue, Oct 4 2022 10:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment