Ind Vs SA T20 Series: KL Rahul Emotional Tweet And Pant Emotional Words On SA Series Captaincy - Sakshi
Sakshi News home page

KL Rahul-Rishabh Pant: జీర్ణించుకోలేకపోతున్నా.. రాహుల్‌ భావోద్వేగం! పంత్‌ ఏమన్నాడంటే!

Published Thu, Jun 9 2022 11:09 AM | Last Updated on Thu, Jun 9 2022 12:31 PM

Ind Vs SA T20 Series: KL Rahul Emotional Tweet Pant Emotional Words - Sakshi

కేఎల్‌ రాహుల్‌- రిషభ్‌ పంత్‌(PC: BCCI)

India Vs South Africa 2022 1st T20I: ‘‘ఈ కఠినమైన వాస్తవాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఈరోజు మరో సవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్వదేశంలో జట్టును ముందుండి నడిపించేందుకు వచ్చిన మొట్ట మొదటి అవకాశం చేజారింది. అయితేనేం, మా ఆటగాళ్లకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. 

నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. రిషభ్‌ పంత్‌ అండ్‌ బాయ్స్‌కు బెస్టాఫ్‌ లక్‌. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాను’’ అంటూ టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత జట్టు రాణించాలని ఆకాంక్షించాడు.

కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నిమిత్తం ప్రొటిస్‌ జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్లు.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా తదితరులకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. కేఎల్‌ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది.

అయితే, జూన్‌ 9 నాటి తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా రాహుల్‌ జట్టుకు దూరం కాగా.. యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశాడు. ఇక టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రోహిత్‌ శర్మ గాయపడటంతో తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రాహుల్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో భారత్‌ 0-3 తేడాతో ప్రొటిస్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది.

నిజమేనా.. జీర్ణించుకోలేకపోతున్నా!
ఇదిలా ఉంటే.. ఆఖరి నిమిషంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు కెప్టెన్‌ అయిన రిషభ్‌ పంత్‌ తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఓ గంట క్రితమే నాకు దీని గురించి తెలిసింది. ఈ ఫీలింగ్‌ చాలా చాలా బాగుంది. భారత జట్టును ముందుండి నడిపించే అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు.

నా క్రికెట్‌ కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’ అని బుధవారం నాటి ప్రీ- మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పుకొచ్చాడు. ఇక గురువారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో టీమిండియా- దక్షిణాఫ్రికా జట్లు మొదటి టీ20లో తలపడనున్నాయి. 

చదవండి: Mithali Raj Retirement: అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ?!
Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement