Ind Vs SL 2nd Test: India Playing XI For Pink Ball Test Against Sri Lanka - Sakshi
Sakshi News home page

Ind Vs Sl 2nd Test: సిరాజ్‌కు నో ఛాన్స్‌.. తుది జట్టులోకి అక్షర్‌

Published Sat, Mar 12 2022 2:03 PM | Last Updated on Sat, Mar 12 2022 3:49 PM

Ind Vs Sl 2nd Test: Playing XI Of Both Teams Axar Patel Replace Jayant - Sakshi

Ind Vs Sl 2nd Test: Playing XI Of Both Teams: మొదటి టెస్టులో విజయంతో జోరు మీదున్న టీమిండియా శ్రీలంకతో రెండో టెస్టుకు సిద్ధమైంది. బెంగళూరు వేదికగా డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ ఆడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ముందంజలో ఉన్న రోహిత్‌ సేన మరో క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. 

ఇక పింక్‌బాల్‌ టెస్టుతో టీమిండియా ఆటగాడు అక్షర్‌ పటేల్‌ జట్టులోకి తిరిగి వచ్చాడు. జయంత్‌ యాదవ్‌ స్థానంలో అతడిని తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు టాస్‌ సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. అక్షర్‌ పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించాడన్న హిట్‌మ్యాన్‌.. జయంత్‌ నిరాశపడాల్సిన అవసరం లేదని, అతడికి మరో అవకాశం ఇస్తామని పేర్కొన్నాడు. 

తుదిజట్లు:
భారత్‌:
మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), హనుమ విహారి, విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా.

శ్రీలంక:
దిముత్‌ కరుణరత్నే(కెప్టెన్‌), లాహిరు తిరుమన్నె, కుశాల్‌ మెండిస్‌, ఏంజెలో మాథ్యూస్‌, ధనుంజయ డిసిల్వా, చరిత్‌ అసలంక, నిరోశన్‌ డిక్‌విల్లా(వికెట్‌ కీపర్‌), సురంగ లక్మల్‌, లసిత్‌ ఎంబల్డెనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్‌ జయవిక్రమ.

చదవండి: World Cup 2022: మంధాన, హర్మన్‌ అద్భుతం.. భారత్‌ భారీ విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement