రిషభ్ పంత్- రవిచంద్రన్ అశ్విన్(PC: BCCI)
India Vs West Indies 1st T20: వెస్టిండీస్- టీమిండియా మధ్య శుక్రవారం టీ20 సిరీస్ ఆరంభం కానుంది. బ్రియన్ లారా స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా భారత తుది జట్టును అంచనా వేశాడు. రోహిత్ శర్మకు జోడీగా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఓపెనర్‌గా వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
ఇక మూడో స్థానంలో దీపక్ హుడా పేరు పరిశీలనలో ఉన్నా శ్రేయస్ అయ్యర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో.. ఇటీవల పూర్తిస్థాయిలో రాణిస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు.
అశూ వద్దు!
అదే విధంగా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఆరో స్థానంలో బరిలోకి దిగుతాడని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ఇక గాయంతో బాధపడుతున్న రవీంద్ర జడేజా అందుబాటులో లేనట్లయితే అతడి స్థానాన్ని అక్షర్ పటేల్‌తో భర్తీ చేయొచ్చని పేర్కొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు తనైతే తుదిజట్టులో అవకాశం ఇవ్వనని, అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఎంచుకుంటానని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఇక ఆవేశ్ ఖాన్ కంటే కూడా అర్ష్‌దీప్‌ను ఆడిస్తేనే మెరుగైన ఫలితం ఉంటుందన్న ఆకాశ్ చోప్రా.. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్‌తో అతడు బౌలింగ్ విభాగంలో ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌కప్-2022 ప్రణాళికల్లో అర్ష్‌దీప్ పేరు ఉంటే గనుక అతడికి ఈ సిరీస్‌లో తప్పక అవకాశం ఇవ్వాలని ఆకాశ్ చోప్రా సూచించాడు.
మ్యాచ్ గెలవడం ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం తుది జట్టును ఎంపిక చేయడం కూడా అంతే సవాలుతో కూడుకున్న పనిగా మారిందని ఈ సందర్భంగా అతడు వ్యాఖ్యానించాడు. అందరూ మెరుగ్గా రాణిస్తున్నపుడు జట్టు ఎంపిక క్లిష్టతరమవుతుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టు:
రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియాబీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కేఎల్ రాహుల్*.
Comments
Please login to add a commentAdd a comment