టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో శిఖర్ ధావన్(ఫైల్ ఫొటో)
India Tour of West Indies, 2022: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. ఈ మేరకు విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడబోయే జట్టు వివరాలు వెల్లడించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది.
ఇక వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సెలక్టర్లు ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కింది. అదే విధంగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన దీపక్ హుడా విండీస్‌తో వన్డేలకు ఎంపికయ్యాడు. సంజూ శాంసన్ సైతం మరోసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా అవకాశం దక్కింది.
ఇక జూలై 22న మొదటి వన్డేతో టీమిండియా- వెస్టిండీస్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది. కాగా గతంలో శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో శిఖర్ ధావన్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తదితరులకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా!
వన్డే సిరీస్
►జూలై 22- మొదటి వన్డే
►జూలై 24- రెండో వన్డే
►జూలై 27- మూడో వన్డే
టీ20 సిరీస్
►మొదటి టీ20- జూలై 29
►రెండో టీ20- ఆగష్టు 1
►మూడో టీ20- ఆగష్టు 2
►నాలుగో టీ20- ఆగష్టు 6
►ఐదో టీ20- ఆగష్టు 7
చదవండి: Jasprit Bumrah: అందుకే ఓడిపోయాం.. అయితే, కెప్టెన్సీ చేయడం నచ్చింది! భవిష్యత్తులో..
ICC Mens Test Rankings: దుమ్ములేపిన పంత్.. ఏకంగా! దిగజారిన కోహ్లి ర్యాంకు.. ఇక బెయిర్‌స్టో..
🚨 NEWS 🚨: The All-India Senior Selection Committee has picked the squad for the three-match ODI series against the West Indies to be played at the Queen's Park Oval, Port of Spain, Trinidad.#TeamIndia | #WIvIND
— BCCI (@BCCI) July 6, 2022
Comments
Please login to add a commentAdd a comment