భార‌త్ 462 ఆలౌట్‌.. అరంగేట్రంలోనే లంక బౌల‌ర్‌ చెత్త రికార్డు | India 462 All-out-Lanka Bowler Keshara Nuwanta Worst Record-Debut | Sakshi
Sakshi News home page

భార‌త్ 462 ఆలౌట్‌.. అరంగేట్రంలోనే లంక బౌల‌ర్‌ చెత్త రికార్డు

Aug 17 2026 10:37 AM | Updated on Aug 17 2026 11:19 AM

India 462 All-out-Lanka Bowler Keshara Nuwanta Worst Record-Debut

Photo Credit: Twitter

గాలే వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక డెబ్యూ బౌల‌ర్ కెషారా నువంతా చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్నాడు. అరంగేట్రం టెస్టులో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న నాలుగో బౌల‌ర్‌గా కెషారా నిలిచాడు. భార‌త తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవ‌ర్లు వేసిన కెషారా నువంతా మూడు వికెట్లు తీసి 175 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. 

ఇక లంక త‌ర‌ఫున అరంగేట్రం టెస్టులో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్‌గా సూర‌జ్ ర‌న్‌దివ్ నిలిచాడు. 2010లో కొలంబో వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 73 ఓవ‌ర్లు వేసిన సూర‌జ్ ర‌న్‌దివ్ రికార్డు స్థాయిలో 222 ప‌రుగులు సమ‌ర్పించుకున్నాడు. 2025లో గాలే వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టెస్టులో త‌రిందు ర‌త్న‌నాయ‌కే 49.2 ఓవ‌ర్ల‌లో 196 ప‌రుగులు స‌మ‌ర్పించుకుని రెండో స్థానంలో ఉన్నాడు. 

1999లో ఢాకా వేదిక‌గా పాక్‌తో టెస్టులో ఉపుల్ చంద‌న 47.5 ఓవ‌ర్ల‌లో 179 ప‌రుగులిచ్చుకొని మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 2020లో సౌతాఫ్రికాతో టెస్టులో 171 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న వ‌నిందు హ‌స‌రంగ‌ ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

టీమిండియా ఆలౌట్‌
ఇక మ్యాచ్ విష‌యానికొస్తే భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 462 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 460 ప‌రుగుల ఓవ‌ర్‌నైట్ స్కోరుకు మ‌రో రెండు ప‌రుగులు జోడించిన అనంత‌రం చివ‌రి వికెట్ కోల్పోయింది. దేవ‌దత్ ప‌డిక్క‌ల్ (167) సెంచ‌రీతో రాణించ‌గా, ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధ‌శ‌త‌కాల‌తో మెరిశారు. లంక బౌలర్ల‌లో ప్ర‌బాత్ జ‌య‌సూరియా 4 వికెట్లు తీయ‌గా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

చదవండి: 'పంత్ వ‌ల్ల కాలేదు బ‌ట్ల‌ర్ సాధించాడు.. చాలా సంతోషం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement