Photo Credit: BCCI Twitter
గాలే వేదికగా మొదలైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ కండరాల నొప్పితో మైదానం వీడడం భారత శిబిరంలో ఆందోళన కలిగించింది. అర్ధశతకం సాధించిన రాహుల్ శతకం వైపు పరుగులు తీస్తున్న క్రమంలోనే కండరాల నొప్పితో విలవిల్లాడిపోయాడు. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో టీ బ్రేక్ తర్వాత బ్యాటింగ్‌కు రాలేకపోయాడు.
దీంతో లంకతో టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్ దూరమవుతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కేఎల్ రాహుల్ గాయంపై బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. రాహుల్ ఫిట్‌నెస్‌పై అందోళన వద్దని అంటున్నాడు. కండరాలు పట్టేశాయని, భారత ఓపెనర్ ఫిట్‌గానే ఉన్నాడని సితాన్షు వెల్లడించాడు.
‘కేఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నా దృష్టిలో అతడికి క్రాంప్స్ వచ్చాయంతే. రోజు ముగిసే సరికి అతడు బాగానే ఉన్నాడు. కండరాలు పట్టేయడం మొదలయ్యాక .. తొడ కండరాలు నొప్పి మొదలవుతుంది. ఒక్కోసారి గజ్జల్లోనూ నొప్పి వస్తుంది. కానీ, అతడు బాగానే ఉన్నాడు. రేపు అతడు బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉంటాడు’ అని సితాన్షు పేర్కొన్నాడు.
గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టును భారత్ ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు ఆటలో ఆతిథ్య జట్టుపై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పడిక్కల్ 131 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రిషబ్ పంత్ (31) క్రీజులో ఉన్నాడు.
A worrying moment in Galle. 😟💔
KL Rahul has retired hurt after struggling with an issue in his right-hand finger, along with severe cramps.
He was seen receiving treatment before walking back to the dressing room. Hoping it’s nothing serious and KL is back soon. 🙏❤️
📸:… pic.twitter.com/Q8w6XdHuwx— CricTracker (@Cricketracker) August 15, 2026
Read: ఆఫ్గన్ కెప్టెన్ రికార్డు సెంచరీ.. ఐర్లాండ్ క్లీన్‌స్వీప్


