టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 పోటీలు హోరాహారీగా జరగుతున్నాయి. తొలి మ్యాచ్‌లోనే ఢిపిండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు కివీస్ షాకివ్వగా.. అనంతరం పాకిస్తాన్‌పై భారత్ అద్భుతవిజయం సాధించింది. ఈ క్రమంలో చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియాపై ఉక్రెయిన్ క్రికెట్ ఫెడరేషన్ సీఈవో కోబస్ ఆలివర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
క్రిక్ ట్రాకర్‌తో ఆలివర్ మాట్లాడుతూ.. "పాకిస్తాన్‌పై భారత్ ఆడిన విధానం అద్భుతమైనది. ఈ మ్యాచ్ విజయంతో దాదాపు వరల్డ్‌కప్‌ను భారత్ గెలిచినట్లే. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తిరుగులేని జట్టుగా నిలుస్తోంది అని భావిస్తున్నాను. టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ ఖచ్చితంగా నిలుస్తోంది.
ఇక విరాట్ మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కోహ్లి ఇన్నింగ్స్ మాత్రం ప్రపంచకప్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది" అని పేర్కొన్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 27న నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
చదవండి: T20 World Cup 2022: పాకిస్తాన్‌పై అద్భుత విజయం.. డ్యాన్స్ చేసిన సునీల్ గవాస్కర్
Comments
Please login to add a commentAdd a comment