ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన అవసరం లేదు. దాయాదుల మధ్య పోరు ఎప్పుడుంటుందా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. అటువంటిది ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో భారత్-పాక్ తలపడనుండడంతో ఫ్యాన్స్ అనందానికి అవధులు లేవు.
ఇప్పటికే ఆసియాకప్ లీగ్ దశలో భారత్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. సూపర్-4లో మరోసారి ఈ ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీ తర్వాత భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో దాయాదుల పోరు జరగనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థిలు భారత్-పాక్ తలపడనున్నాయి.
టిక్కెట్ ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
2019 తర్వాత వన్డే ప్రపంచకప్‌లో దాయాదుల పోరు జరగనుండంతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడాలనుకుంటున్న అభిమానులు టిక్కెట్ల కోసం మాత్రం తమ అస్తులు అమ్ముకోవాల్సిందే. అవును మీరు విన్నది నిజమే. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్కో టిక్కెట్ ధర అత్యధికంగా రూ. 57 లక్షలు పలుకుతోంది.
వాస్తవానికి బీసీసీఐ అధికారికంగా ఈ మ్యాచ్ టికెట్లను ఆగస్టు 29, సెప్టెంబర్ 3 తేదీల్లో బుక్‌మై షోలో అమ్మకాలకు ఉంచింది. బుకింగ్ ఓపెన్ చేసిన గంటలోపే ‘సోల్డ్ అవుట్’ బోర్డు కనిపించింది. దీన్ని సెకెండరీ మార్కెట్‌లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ టికెట్ ఎక్సేంజ్, రీసెల్ వెబ్‌సైట్ అయిన వయాగోగో తమకు నచ్చిన విధంగా ధరలు నిర్ణయించి విక్రయిస్తోంది.
వయాగొగో టికెట్ల రేటు ప్రకారం.. నరేంద్ర మోడీ స్టేడియంలో గల అప్పర్ టైర్ టికెట్స్ రేట్లు రూ. 57 లక్షలుగా ఉంది. అవి కూడా రెండు టిక్కెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదే విధంగా సౌత్ ప్రీమియమ్ వెస్ట్ బే టికెట్ రేట్ రూ. 19.5 లక్షలుగా ఉంది. ఈ టిక్కెట్ల ధరకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "అసలు ఏం జరుగుతోంది? వయాగోగో వెబ్‌సైట్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్‌కప్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు 65,000 నుండి 4.5 లక్షల వరకు ఉన్నాయి. కార్పోరేట్ సంస్థలు నిలువ దోపిడికీ పాల్పడుతున్నాయి అంటూ ఎక్స్(ట్విటర్)లో కామెంట్ చేశాడు.
చదవండి: WC 2023: జింబాబ్వేపై ఆడాడని వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేశారా? జట్టులో దండుగ అతడు
Comments
Please login to add a commentAdd a comment