
దక్షిణాఫ్రికా గడ్డపై ఎదురైన ఘోర పరాభావంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులో సమతుల్యం లోపించిందని, సఫారీ పర్యటన తమకు మంచి గుణపాఠం నేర్పిందని, ప్రపంచకప్ నాటికి ప్రస్తుతమున్న లోపాలన్నిటిని సరి చేసుకుంటామని తెలిపాడు. వన్డే సిరీస్‌లో లోయర్ మిడిలార్డర్ దారుణంగా విఫలమైందని.. శార్ధూల్, దీపక్ చాహర్‌లకు బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు.
మిడిల్ ఓవర్లలో రాణించలేకపోవడమే తమకు దక్షిణాఫ్రికాకు తేడా అని, ఈ విషయంలో వారు తమకంటే చాలా మెరుగైన ప్రదర్శన కనబర్చారని కితాబునిచ్చాడు. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్‌ను ఈ సందర్భంగా వెనకేసుకొచ్చాడు. భవిష్యత్తులో రాహుల్ తన లోపాలను అధిగమించి సత్ఫలితాలు సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో, వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వన్డే సిరీస్‌కు సారధిగా వ్యవహరించాడు.
చదవండి: ఆ ఇద్దరి రాకతో హార్ధిక్ స్థానం గల్లంతు.. !
Comments
Please login to add a commentAdd a comment