IPL 2021 CSK Vs RR: Live Score Updates, Match Highlights In Telugu - Sakshi
Sakshi News home page

45 పరుగుల తేడాతో ధోని సేన ఘన విజయం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Published Mon, Apr 19 2021 7:15 PM | Last Updated on Mon, Apr 19 2021 11:33 PM

IPL 2021: CSK Vs RR - Sakshi

Photo Courtesy: BCCI/IPL

చెన్నై బౌలర్ల  ధాటికి రాజస్థాన్‌ విలవిల
చెన్నై బౌలర్ల ధాటికి రాజస్థాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ విలవిలలాడింది. 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌ జట్టు ఏ దశలోనూ పోటీనివ్వలేక చతికిలపడింది. మొయిన్‌ అలీ(3/7), కర్రన్‌(2/24), జడేజా(2/28), బ్రేవో(1/28), శార్ధూల్‌(1/20)ల దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసిన ఆర్‌ఆర్‌ జట్టు.. 45 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.  

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఆర్‌ఆర్‌..ఉనద్కత్‌(24) ఔట్‌
శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో జడేజా మరో క్యాచ్‌ అందుకోవడంతో ఉనద్కత్(17 బంతుల్లో 24; 2 ఫోర్లు, సిక్స్‌)‌ ఔటయ్యాడు. 19.2 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 143/9. క్రీజ్‌లో ముస్తాఫిజుర్‌(0), సకారియా(0) ఉన్నారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తెవాతియా(20) ఔట్‌.. 19 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 137/8
బ్రేవో బౌలింగ్‌లో రుతురాజ్‌ క్యాచ్‌ పట్టడంతో తెవాతియా(15 బంతుల్లో 20; 2 సిక్స్‌లు) ఔటయ్యాడు. 19వ ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 137/8. క్రీజ్‌లో ఉనద్కత్‌, ముస్తాఫిజుర్‌ ఉన్నారు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ 
15వ ఓవర్‌ తొలి బంతికి పరాగ్‌ను ఔట్‌ చేసిన మొయిన్‌.. మూడో బంతికి క్రిస్‌ మోరిస్‌(2 బంతుల్లో 0) కూడా బోల్తా కొట్టించి రాజస్థాన్‌ పరాజయాన్ని ఖరారు చేశాడు. మిడ్‌ వికెట్‌లో జడేజా మరో క్యాచ్‌ అందుకోవడంతో మోరిస్‌ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. 14.3 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 95/7. క్రీజ్లో తెవాతియా(1), ఉనద్కత్‌(0) ఉన్నారు.

రాజస్థాన్‌ ఆరో వికెట్‌ డౌన్‌.. పరాగ్‌(3) ఔట్‌
మొయిన్‌ అలీ రాజస్థాన్‌ను మరో దెబ్బ కొట్టాడు. 15వ ఓవర్‌ తొలి బంతికి రియాన్‌ పరాగ్‌ను(7 బంతుల్లో 3) పెవిలియన్‌కు పంపాడు. డీప్‌ మిడ్‌ వికెట్‌లో జడేజా క్యాచ్‌ పట్టడంతో పరాగ్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. 14.1 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 95/6. క్రీజ్‌లో తెవాతియా(1), మోరిస్‌‌(0) ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌.. మిల్లర్‌(2) ఔట్
13వ ఓవర్‌ ఐదో బంతికి మిల్లర్‌ను(5 బంతుల్లో 2) మొయిన్‌ అలీ బోల్తా కొట్టించాడు. అలీ బౌలింగ్‌లో మిల్లర్‌ ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 92/5. క్రీజ్‌లో పరాగ్‌(1), తెవాతియా(0) ఉన్నారు.

దూబే(17) ఔట్‌.. 12 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 90/4‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌ 
12వ ఓవర్‌ తొలి బంతికి బట్లర్‌ వికెట్‌ తీసిన జడేజా.. ఆఖరి బంతికి దూబేని(20 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా బోల్తా కొట్టించి రాజస్థాన్‌ విజయావకాశాలను దెబ్బకొట్టాడు. జడేజా బౌలింగ్‌లో దూబే ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 90/4‌గా ఉంది. క్రీజ్‌లో మిల్లర్‌, రియాన్‌ పరాగ్‌ ఉన్నారు.

బట్లర్‌(49) క్లీన్‌ బౌల్డ్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
సెట్‌ అయిన బ్యాట్స్‌మెన్‌ జోస్‌ బట్లర్‌ను(35 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) క్లీన్‌ బౌల్డ్ చేసిన జడేజా.. రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 12వ ఓవర్‌ తొలి బంతికి బట్లర్‌ బౌల్డ్‌ కావడంతో రాజస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 12.1 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 87/3. క్రీజ్‌లో దూబే, మిల్లర్‌ ఉన్నారు. 

ఆచితూచి ఆడుతున్న ఆర్‌ఆర్‌.. 9 ఓవర్ల తర్వాత 70/2
కెప్టెన్‌ సామ్సన్‌ వికెట్‌ కోల్పోయాక రాజస్థాన్‌ జట్టు సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడినట్లు కనిపిస్తోంది. 45 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయాక ఆ జట్టు ఆచితూచి ఆడుతోంది. బట్లర్‌(40), దూబే(13) అడపాదడపా షాట్లు ఆడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు కదిలిస్తున్నారు. దీంతో 9 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ జట్టు 2 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది.

డేంజర్‌ మ్యాన్‌ సామ్సన్‌(1) ఔట్‌‌‌‌‌‌‌‌‌‌
సామ్‌ కర్రన్‌కు రెండో ఫలితం దక్కింది. 5.5 బంతికి డేంజర్‌ బ్యాట్స్‌మెన్‌ సామ్సన్‌(5 బంతుల్లో 1) పెవిలియన్‌ బాటపట్టాడు. కర్రన్‌ బౌలింగ్‌లో బ్రేవో క్యాచ్‌ అందుకోవడంతో సామ్సన్‌ ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 45/2. క్రీజ్లో బట్లర్‌ (28), దూబే(0) ఉన్నారు.  

తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌.. వోహ్రా(14) ఔట్‌‌‌‌‌‌‌‌‌
189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం మొదలుపెట్టింది. ఓపెనర్లు వోహ్రా(11 బంతుల్లో 14;  ఫోర్‌, సిక్స్‌), బట్లర్‌(12 బంతుల్లో 15) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. సామ్‌ కర్రన్‌ వేసిన 3.4 బంతికి సిక్సర్‌ బాదిన వోహ్రా.. ఆ మరుసటి బంతికే జడేజాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టడంతో రాజస్థాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 4 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 30/1. క్రీజ్‌లోకి సామ్సన్‌(0) వచ్చాడు.

ఆఖరి బంతికి సిక్స్‌.. రాజస్థాన్‌ టార్గెట్‌ 189‌‌‌‌‌‌‌‌
ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి బ్రేవో సిక్స్‌ బాదడంతో సీఎస్‌కే 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. జట్టులో ఎవ్వరూ భారీ స్కోర్‌ చేయనప్పటికీ..చెన్నై గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది. బ్రేవో(8 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌), చాహర్‌(0) నాటౌట్‌గా నిలిచారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్‌దే(33) అత్యధిక స్కోర్‌. రాజస్థాన్‌ బౌలర్లలో సకారియా అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు పడగట్టగా, మోరిస్‌ 2, తెవాతియా, ముస్తాఫిజుర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఆఖరి ఓవర్‌లో మరో రనౌట్‌..శార్ధూల్‌(1) ఔట్
ముస్తాఫిజుర్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో చెన్నై మరో వికెట్‌ కోల్పోయింది. 20వ ఓవర్‌ తొలి బంతికి కర్రన్‌ రనౌట్‌గా వెనుదిరగగా, 20.4 బంతికి శార్ధూల్‌(1) కూడా రనౌటయ్యాడు. వికెట్‌ కీపర్‌ చేతుల్లో బంతి ఉండగానే లేని పరుగుకు ప్రయత్నించి శార్ధూల్‌ ఔటయ్యాడు. 19.4 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 180/9. క్రీజ్‌లో బ్రేవో, చాహర్‌ ఉన్నారు.

సామ్‌ కర్రన్‌(13) రనౌట్..సీఎస్‌కే ఎనిమిదో వికెట్‌ డౌన్‌‌‌‌‌‌‌‌
ముస్తాఫిజుర్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో లేని రెండో పరుగు కోసం ప్రయత్నించిన సామ్‌ కర్రన్‌(6 బంతుల్లో 13; సిక్స్‌) రనౌటగా వెనుదిరిగాడు. 19.1 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 175/8. క్రీజ్‌లో బ్రేవో, శార్ధూల్‌ ఠాకూర్‌ ఉన్నారు.

జడేజా(8) ఔట్‌..ఏడో వికెట్‌ కోల్పోయిన చెన్నై‌‌‌‌‌‌
క్రిస్‌ మెరిస్‌ వేసిన 18.3 బంతికి వికెట్‌ కీపర్‌ సామ్సన్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో జడేజా(7 బంతుల్లో 8; ఫోర్‌) పెవిలియన్‌ బాట పట్టాడు. 19 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 173/7. క్రీజ్‌లో బ్రేవో(8), సామ్‌ కర్రన్‌(12) ఉన్నారు.

సకారియాకు మూడో వికెట్‌.. ధోని(18) ఔట్‌‌‌‌‌‌
కీలకమైన ధోని(17 బంతుల్లో 18; 2 ఫోర్లు) వికెట్‌ను చేతన్‌ సకారియా దక్కించుకున్నాడు. సకారియా బౌలింగ్‌లో బట్లర్‌ క్యాచ్‌ అందుకోవడంతో ధోని వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో సకారియాకు ఇది మూడో వికెట్‌. 17.2 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 147/6. క్రీజ్‌లో కర్రన్‌, జడేజా ఉన్నారు. 

పెవిలియన్‌కు క్యూ కడుతున్న చెన్నై బ్యాట్స్‌మెన్‌.. రైనా(18) ఔట్‌‌‌‌‌
సకారియా వేసిన 14వ ఓవర్‌లో చెన్నై రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 13.2 బంతికి రాయుడు ఔటవ్వగా, 13.5 బంతికి రైనా(15 బంతుల్లో 18; ఫోర్‌, సిక్స్‌) పెవిలియన్‌ బాటపట్టాడు. సకారియా బౌలింగ్‌లో మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మోరిస్‌ సింపుల్‌ క్యాచ్‌ అందుకోవడంతో రైనా వెనుదిరిగాడు. 14 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 125/5. క్రీజ్‌లో ధోని(0), జడేజా(0) ఉన్నారు.

మూడో క్యాచ్‌ అందుకున్న రియాన్‌.. చెన్నై నాలుగో వికెట్‌ డౌన్
భారీ షాట్లు ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించిన రాయుడు(17 బంతుల్లో 27; 3 సిక్సర్లు).. సకారియా బౌలింగ్‌లో స్వీపర్‌ కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రియాన్‌ పరాగ్‌ చేతికి క్యాచ్‌ అందించి వెనుదిరిగాడు. చెన్నై కోల్పోయిన నాలుగు వికెట్లలో రియాన్‌ పరాగ్‌ మూడు క్యాచ్‌లు అందుకోవడం విశేషం. 13.2 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 123/4. క్రీజ్‌లోకి జడేజా(0) వచ్చాడు. 

వరుస సిక్సర్లతో విరుచుకుపడిన రాయుడు.. 12 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 112/3
రియాన్‌ పరాగ్‌ వేసిన 11వ ఓవర్‌లో సిక్సర్‌ బాది ఊపుమీదున్నట్లు కనిపించిన రాయుడు(12 బంతుల్లో 23; 3 సిక్సర్లు).. తెవాతియా వేసిన 12వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో ఉన్న రైనా(10 బంతుల్లో 12; సిక్స్‌) సైతం రియాన్‌ వేసిన 11వ ఓవర్‌లో భారీ సిక్సర్‌ కొట్టడంతో 12 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 112/3గా ఉంది.

తెవాతియాకు చిక్కిన మొయిన్‌(26).. సీఎస్‌కే 78/3
దూకుడుగా ఆడుతున్న మొయిన్‌ అలీ(20 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు) తెవాతియా ఉచ్చులో చిక్కాడు. తెవాతియా బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసిన మొయిన్‌... రియాన్‌ పరాగ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. 9.2 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 78/3. క్రీజ్‌లో రైనా(3), రాయుడు(3) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న మొయిన్‌ అలీ
ముస్తాఫిజుర్‌ వేసిన 7వ ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ సహా 13 పరుగులు రాబట్టిన మొయిన్‌ అలీ(15 బంతుల్లో 21; ఫోర్‌, 2 సిక్సర్లు).. మోరిస్‌ వేసిన తరువాతి ఓవర్‌లో సైతం భారీ సిక్సర్‌ కొట్టి దూకుడు మీదున్నాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సమయానికి సీఎస్‌కే స్కోర్‌ 66/2. క్రీజ్‌లో మొయిన్‌ అలీకి తోడుగా రైనా(0) ఉన్నాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. డుప్లెసిస్‌(33) ఔట్
ఉనద్కత్‌ వేసిన 5వ ఓవర్‌లో 3 ఫోర్లు, సిక్స్‌ సహా మొత్తం 19 పరుగులు పిండుకున్న డుప్లెసిస్‌(17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు).. క్రిస్‌ మోరిస్‌ వేసిన మరుసటి ఓవర్లోనే(5.4 ఓవర్) ఔటయ్యాడు. మోరిస్‌ వేసిన బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నంలో రియన్‌ పరాగ్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టాడు. 6 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 46/2. క్రీజ్‌లో మొయిన్‌ అలీ(6 బంతుల్లో 3), రైనా(0) ఉన్నారు. 

చెన్నై తొలి వికెట్‌ డౌన్‌.. రుతురాజ్‌(10) ఔట్‌
ముస్తాఫిజుర్‌ వేసిన నాలుగో ఓవర్‌ ఐదో బంతికి చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(13 బంతుల్లో 10; ఫోర్‌) పెవిలియన్‌ బాటపట్టాడు. ముస్తాఫిజుర్‌ సంధించిన బంతి లీడింగ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శివమ్‌ దూబే అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. కాగా, రుతురాజ్‌ ప్రస్తుత సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా విఫలమాయ్యడు. 4 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 25/1. క్రీజ్‌లో డుప్టెసిస్‌(11 బంతుల్లో 15), మొయిన్‌ అలీ(0) ఉన్నారు. 

ముంబై: ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్‌ నెగ్గి, పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు వాంఖడే వేదికగా జరుగనున్న పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సామ్సన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ముఖాముఖి పోరులో ఇరు జట్లు ఇప్పటివరకు 24 సందర్భాల్లో ఎదురెదురుపడగా, సీఎస్‌కే 14సార్లు, రాజస్థాన్‌ 10 సార్లు విజయాన్ని సాధించాయి. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌నే విజయం వరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు ముఖాముఖి పోరులో తలపడటం ఇదే మొదటిసారి.

ఇక, జట్టు బలాబలాల విషయానికొస్తే.. చెన్నైతో పోలిస్తే, రాజస్థాన్‌ బ్యాటింగ్‌ కాస్త మెరుగ్గా ఉందనే చెప్పాలి. ఆ జట్టులో కెప్టెన్‌ సంజు సామ్సన్‌, డేవిడ్‌ మిల్లర్‌లు ఇదివరకే సత్తా చాటగా, క్రిస్‌ మోరిస్‌, రియాన్‌ పరాగ్‌లు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌, మనన్‌ వోహ్రా, శివమ్‌ దూబే, రాహుల్‌ తెవాతియాలు రాణిస్తే ప్రత్యర్ధికి కష్టాలు తప్పకపోవచ్చు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధోని, డుప్లెసిస్‌, రుతురాజ్‌ మినహా బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చిన మిగిలిన చెన్నై ఆటగాళ్లంతా రాణించారు. పంజాబ్‌తో జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ పర్వాలేదనిపించారు. బౌలింగ్‌ విభాగంలో రాజస్థాన్‌తో పోలిస్తే చెన్నై కాస్త మెరుగ్గా ఉంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ ధాటికి ప్రత్యర్ధి బెంబేలెత్తిపోయింది. మరోవైపు అదే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

జట్ల వివరాలు: 
చెన్నై సూపర్‌ కింగ్స్‌: డుప్లెసిస్‌, ఉతప్ప‌, మెయిన్‌ అలీ, రైనా, రాయుడు, ధోని, సామ్‌ కర్రన్‌, జడేజా, బ్రేవో, శార్ధూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌

రాజస్థాన్‌ రాయల్స్‌: బట్లర్‌, వోహ్రా, సామ్సన్‌, శివమ్‌ దూబే, మిల్లర్‌, రియాన్ పరాగ్‌, ‌తెవాతియా, మోరిస్‌, ఉనద్కత్‌, సకారియా, ముస్తాఫిజుర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement