Photo Courtesy: Mumbai Indians Twitter
చెన్నై: ముంబై ఇండియన్స్ పోరాడి గెలిచింది. 152 పరుగులు సాధారణ స్కోరును కాపాడుకుని కేకేఆర్‌పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాహుల్ చాహర్ నాలుగు వికెట్లతో గేమ్ చేంజర్‌గా మారగా, , కృనాల్ పాండ్యా వికెట్ సాధించి 13 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించగా, ఆఖరి ఓవర్‌లో బౌల్ట్ రెండు వికెట్లు సాధించి మ్యాచ్‌ను మొత్తం ముంబై వైపు తిప్పాడు. కేకేఆర్ జట్టులో గిల్(33), నితీష్ రానా(57) లు మాత్రమే రాణించడంతో ఓటమి తప్పలేదు. కేకేఆర్ 142 పరుగులకే పరిమితమైన ఓటమి పాలైంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. డీకాక్(2) నిరాశపరచగా, రోహిత్ శర్మ(43; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్), సూర్యకుమార్ యాదవ్(56; 36 బంతుల్లో 7 ఫోర్లుi, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ ఇద్దరు తర్వాత హర్దిక్ పాండ్యా(15), కృనాల్ పాండ్యా(15)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు. దాంతో ముంబై ఇండియన్స్ సాధారణ స్కోరుకు పరిమితమైంది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను రసెల్ కకావికలం చేశాడు. రెండు ఓవర్లు వేసి ఐదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతనికి జతగా కమిన్స్ రెండు వికెట్లు సాధించగా, షకీబుల్, ప్రసీద్ధ్, చక్రవర్తిలు తలో వికెట్ తీశారు.
నాలుగు ఓవర్లు.. నాలుగు వికెట్లు
Photo Courtesy : Mumbai Indians Twitter
ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్ నాలుగు వికెట్లతో తన స్పెల్‌ను పూర్తి చేశాడు. ప్రతీ ఓవర్‌కు వికెట్ చొప్పున తీస్తూ ముంబైకి బ్రేక్ త్రూలు ఇచ్చాడు రాహల్ చాహర్ 27 పరుగులే ఇచ్చాడు. రానా(57) నాల్గో వికెట్‌గా ఔట్ అయ్యాడు. ఆపై కేకేఆర్ 122 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. షకీబుల్(9)ను కృనాల్ ఔట్ చేశాడు.
మోర్గాన్(7) ఔట్
కేకేఆర్ 104 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. మూడో వికెట్‌గా ఇయాన్ మోర్గాన్(7) పెవిలియన్ చేరాడు. రాహుల్ చాహర్ వేసిన 13 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన మోర్గాన్.. మార్కో జాన్సన్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. కేకేఆర్ కోల్పోయిన మూడు వికెట్లు చాహర్ ఖాతాలోనే పడ్డాయి.
మెరిసిన చహర్.. రెండో వికెట్ డౌన్
ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చహర్ రెండో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 5 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి కీపర్ డికాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కేకేఆర్ 84 పరగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. రానా 45, మోర్గాన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
చెపాక్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.
7 ఓవర్ల తర్వాత కేకేఆర్ 50/0
153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్‌కు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు నితీశ్ రాణా(24 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 22; 4 ఫోర్లు)లు చెత్త బంతులను బౌండరీలుగా తరలిస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో 7 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 50/0.
ఆచితూచి ఆడుతున్న కేకేఆర్, 5 ఓవర్ల తర్వాత 32/0
ముంబై నిర్ధేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ జట్టు ఆచితూచి ఆడుతుంది. నితీశ్ రాణా(19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్) అడపాదడపా బౌండరీలు బాదుతుండగా, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(10 బంతుల్లో 8; ఫోర్) సింగల్స్‌కే పరిమితమయ్యాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 32 పరుగులు సాధించింది.
రసెల్ మ్యాజిక్ స్పెల్.. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు
ఆఖరి ఓవర్లో ఆండ్రీ రసెల్ మ్యాజిక్ చేశాడు. తొలి రెండు బంతులను బౌండరీలుగా సమర్పించుకున్న రసెల్.. మూడో బంతికి కృనాల్‌ను(9 బంతుల్లో 15; 3 ఫోర్లు), నాలుగో బంతికి బుమ్రా(0), ఆఖరి బంతికి చాహర్‌ను(7 బంతుల్లో 8) ఔట్ చేసి ఐపీఎల్ కెరీర్‌లో మొదటిసారి 5 వికెట్ల ఘనతను సాధించాడు. 18వ ఓవర్‌లో పోలార్డ్, జెన్సెన్‌ల వికెట్లు పడగొట్టిన రసెల్.. 2 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు. రసెల్ ధాటికి ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే ప్రస్తుత ఐపీఎల్‌లో (14వ సీజన్) రసెల్‌ది రెండవ 5 వికెట్ల ఘనత కావడం విశేషం. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ కూడా ఐదు వికెట్లు పడగొట్టాడు.
జెన్సెన్ డకౌట్..
రసెల్‌కు ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు లభించాయి. 18 ఓవర్ రెండో బంతికి పోలార్డ్‌ను ఔట్ చేసిన రసెల్.. ఆమరుసటి బంతిని వైడ్ బాల్ వేసి, మూడో బంతికి జెన్సెన్‌ను బోల్తా కొట్టించాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన జెన్సెన్.. డీప్ ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్త్నున పాట్ కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 17.3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 126/7. క్రీజ్‌లో కృనాల్(1), చాహర్(0) ఉన్నారు.
ముంబై ఆరో వికెట్ డౌన్, పోలార్డ్(5) ఔట్
రసెల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ క్యాచ్ అందుకోవడంతో పోలార్డ్(8 బంతుల్లో 5; ఫోర్) పెవిలియన్ బాట పట్టాడు. 17.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 125/6. క్రీజ్‌లో కృనాల్, జెన్సెన్ ఉన్నారు.
హార్ధిక్(15) ఔట్, ఐదో వికెట్ కోల్పోయిన ముంబై
ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన హార్ధిక్(17 బంతుల్లో 15; 2 ఫోర్లు) డీప్ మిడ్ ఆఫ్‌లో ఉన్న ఆండ్రీ రసెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 16.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 123/5. క్రీజ్‌లో పోలార్డ్(4), కృనాల్(0) ఉన్నారు.
ముంబై నాలుగో వికెట్ డౌన్, రోహిత్(43) క్లీన్ బౌల్డ్
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నెమ్మదిగా ఆడిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(32 బంతుల్లో 43; 3 ఫోర్లు, సిక్స్) పాట్ కమిన్స్ బౌలింగ్ బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో క్లీన్ బౌల్డయ్యాడు. 15.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 115/4. క్రీజ్‌లో హార్ధిక్(15 బంతుల్లో 11; ఫోర్), పోలార్డ్(0) ఉన్నారు.
మూడో కోల్పోయిన ముంబై, ఇషాన్ కిషన్(1) ఔట్
పాట్ కమిన్స్ బౌలింగ్ హుక్ షాట్ ఆడే క్రమంలో ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్(3 బంతుల్లో 1) పెవిలియన్ బాట పట్టాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్ 91/3. క్రీజ్‌లో రోహిత్(28), హార్ధిక్ పాండ్యా(2) ఉన్నారు.
ఐపీఎల్ 2021: సూర్యకుమార్(56) ఔట్, ముంబై స్కోర్ 86/2
ధాటిగా ఆడుతున్న సూర్యకుమార్(36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో 56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియనకు చేరాడు. షకీబ్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ ఫీల్డర్ శుబ్‌మన్ గిల్ క్యాచ్ అందుకోడంతో సూర్యకుమార్ ఇన్నంగ్స్‌కు తెరపడింది. 11 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 88/2. క్రీజ్‌లో రోహిత్(27), ఇషాన్ కిషన్(1) ఉన్నారు.
సిక్సర్‌తో హాఫ్ సెంచరీకి పూర్తి చేసిన సూర్యకుమార్
ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆతరువాత గేర్ మార్చి పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలో అతను సిక్సర్ బాది అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్ల తర్వాత ముంబై వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజ్‌లో సూర్యకుమార్‌కు జతగా రోహిత్(25) ఉన్నాడు.
గేర్ మార్చిన సూర్యకుమార్.. ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్‌లో 15 పరుగులు
అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన సూర్యకుమార్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 8వ ఓవర్‌లో గేర్ మర్చాడు. వరుసగా 6,4,4 పరుగులు సాధించి నెమ్మదించిన ముంబై స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. దీంతో 8 ఓవర్ తర్వాత ముంబై వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ(15 బంతుల్లో 20; 2 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్(27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్) ఉన్నారు.
నత్త నడకలా ముంబై స్కోర్, 7 ఓవర్ల తర్వాత 48/1
ముంబై ఇండియన్స్ స్కోర్ నత్త నడకను తలపిస్తుంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ(14 బంతుల్లో 19; 2 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 25; 4 ఫోర్లు)లు సింగల్స్ తప్ప బౌండరీలు సాధించేందుకు ఆసక్తి కనబర్చడకపోవడం స్కోర్ నెమ్మదిగా ముందుకు కదులుతుంది. దీంతో 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 46/1.
5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 37/1
రెండో ఓవర్‌లోనే డికాక్ వికెట్ కోల్పోయిన ముంబై జట్టు ఆచితూచి ఆడుతుంది. కోల్‌కతా కెప్టెన్ స్పిన్ ఎటాక్‌ను పదేపదే ప్రయోగించడంతో ముంబై జట్టు పరుగులు రాబట్టేందుకు చాలా ఇబ్బంది పడుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(11 బంతుల్లో 16; 2 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్(13 బంతుల్లో 17; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 37/1.
ముంబై తొలి వికెట్ డౌన్, డికాక్(2) ఔట్
ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ లిన్ బదులు జట్టులోకి వచ్చిన డికాక్‌ను(6 బంతుల్లో 2) వరుణ్ చక్రవర్తి బోల్తా కొట్టించాడు. డికాక్ భారీ షాట్ ఆడే క్రమంలో డీప్ మిడ్ వికెట్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 10/1. కెప్టెన్ రోహిత్‌కు(6 బంతుల్లో 8; ఫోర్) తోడుగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు.
ఐపీఎల్ 14వ సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్లు హోరాహొరిగా తలపడనున్నాయి. సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓటమిపాలైన ముంబై ఒత్తిడిలో ఉండగా.. సన్‌రైజర్స్‌పై 10 పరుగుల తేడాతో గెలిచిన ఉత్సాహంలో కేకేఆర్ ఉంది. ఇక రికార్డుల పరంగా చూస్తే.. కేకేఆర్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ వచ్చింది. ఇప్పటి వరకు ఇరు జట్లు 27 సార్లు తలపడగా.. ఇందులో ముంబై ఏకంగా 21 మ్యాచ్‌ల్లో గెలవగా.. కోల్‌కతా కేవలం ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యేది ఖాయంగా కనిపిస్తుంది. ఐపీఎల్‌లో ముంబైపై కోల్‌కతా నైట్‌రైడర్స్ అత్యధిక స్కోరు 232 పరుగులు కాగా.. కేకేఆర్‌పై ముంబయి హైయ్యెస్ట్ స్కోర్ 210 పరుగులుగా ఉంది. దుబాయ్ వేదికగా జరిగిన గత సీజన్‌లో ఇరు జట్లు రెండు పర్యాయాలు తలపడగా.. రెంటిలోనూ ముంబై ఇండియన్సే విజయం సాధించడం విశేషం.
ఇక బలబలాల విషయానికి వస్తే ముంబై జట్టు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ , పాండ్యా బ్రదర్స్‌తో పటిష్టంగా కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన క్రిస్ లిన్ ఆకట్టుకున్నా.. క్వింటన్ డికాక్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా, బౌల్ట్‌లతో ఈ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. అయితే నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడమే ముంబైని కలవరపెడుతుంది. మరోవైపు కేకేఆర్‌కు ఓపెనర్ నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠిలు మంచి ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. దినేశ్ కార్తీక్ మంచి టచ్‌లో ఉండడం ఆ జట్టుకు అదనపు బలం. ఇక గిల్, రస్సెల్, మోర్గాన్‌లు ఫామ్‌లోకి వస్తే ముంబైకి కష్టాలు తప్పకపోవచ్చు. బౌలింగ్‌లో కమిన్స్, ప్రసిధ్ కృష్ణ ఫామ్‌లో ఉండగా.. షకీబ్ అల్ హసన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
తుది జట్లు వివరాలు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, మార్కో జాన్సెన్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా
కేకేఆర్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment