ముంబై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వరుసగా విఫలం అవుతున్న కేకేఆర్ స్టార్ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కచ్చితంగా తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడని ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ ధీమా వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన గిల్ కనీసం అన్ని పరుగులు కలిసి వంద కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేకేఆర్ ఓటములకు ఓపెనర్ గిల్ స్థాయి తగ్గ ఆటను ప్రదర్శించకపోవడం కూడా కారణమంమంటూ మండిపడుతున్నారు. దీనిపై పోస్ట్ మ్యాచ్ కాన్పరెన్స్‌లో హస్సీకి ఎదురైన ప్రశ్నలో భాగంగా గిల్ ప్రదర్శనపై విశ్వాసం వ్యక్తం చేశాడు.
‘ అతనొక స్టార్ ప్లేయర్. టెక్నికల్‌గా కూడా మంచి పట్టున్న ప్లేయర్. ఫామ్ అనేది వస్తుంది.. పోతుంది. క్లాస్ అనేది ఎప్పుడూ శాశ్వతం. అతనొక క్లాస్ ఆటగాడు. ఆఫ్ ఫీల్డ్, ఆన్ ఫీల్డ్‌లో అతనొక క్లాస్. నా మాటల్ని గుర్తు పెట్టుకోండి. ఈ సీజన్ ముగిసే సరికి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ కూడా ఉంటాడు’ అని తెలిపాడు. రాజస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ దారుణంగా ఓడిపోయింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. గిల్ 11 పరుగులే చేసి నిరాశపరిచాడు.
ఇక్కడ చదవండి: అతని కెప్టెన్సీతో హ్యాపీగా లేరు : సెహ్వాగ్
Comments
Please login to add a commentAdd a comment