David Hussey
-
'రింకూ సింగ్ ఖచ్చితంగా టీమిండియాకు ఆడుతాడు'
ఐపీఎల్-2023లో అదరగొడుతున్న కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ డేవిడ్ హస్సీ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో రింకూ సింగ్ ఖచ్చితంగా భారత్ తరపున ఆడుతాడని డేవిడ్ హస్సీ జోస్యం చెప్పాడు. ఈ ఏడాది సీజన్లో రింకూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది ఓవర్‌నైట్ స్టార్‌గా రింకూ సింగ్ మారాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 251 పరుగులు చేశాడు. రింకూ సింగ్ కోల్‌కతా తరఫున 2018 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. "రింకూ సింగ్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. అతడు దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అదే విధంగా అతడికి కేకేఆర్ ఫ్రాంచైజీ బాగా మద్దతుగా నిలిచింది. రింకూ కూడా తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత్ తరపున ఆడుతాడు" అని స్టార్‌స్పోర్ట్స్ షోలో హస్సీ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఢిల్లీతో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పులు! ఆంధ్ర ఆటగాడు ఎంట్రీ -
ఐపీఎల్ ముగిసిన తర్వాత దేశానికి రానివ్వరని..
ముంబై: భారత్‌లో కరోనా విజృంభిస్తున్న వేళ విదేశీ ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నారు. రాజస్తాన్ ఆటగాడు లియామ్ లివింగ్ స్టోన్ తాను బయోబుల్‌లో ఉండలేనంటూ ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోగా.. తాజాగా రాజస్తాన్‌కే చెందిన మరో ఆటగాడు ఆండ్రూ టైతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌లు కూడా ఇంటిబాట పట్టారు. ఈ నేపథ్యంలో కేకేఆర్ మెంటార్.. మాజీ ఆసీస్ ఆటగాడు డేవిడ్ హస్సీ స్పందించాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత కరోనా పేరుతో దేశానికి రానివ్వనేమోరన్న ఆందోళన ఆటగాళ్లలో ఎక్కువైపోయిందని.. అందుకే అర్థంతరంగా ఐపీఎల్ వీడుతున్నారని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ..''ఆసీస్‌కు చెందిన చాలామంది ఆటగాళ్లు ఈసారి ఐపీఎల్లో ఆడుతున్నారు. స్మిత్, మ్యాక్స్‌వెల్, కమిన్స్, కౌల్టర్ నీల్ ఇలా ఎక్కువ మొత్తంలో ఆసీస్ ఆటగాళ్లు ఉన్నారని.. వారు కూడా భయంతోనే ఉన్నారు. నిజానికి ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే. తిరిగి ఆస్ట్రేలియా వెళ్తామా లేదా అన్న సందేహం వాళ్లకు ఉంది. వీళ్లే కాదు మరికొందరు ప్లేయర్స్ పరిస్థితి కూడా ఇదే. మేము బయో బబుల్స్‌లోనే ఉంటున్నాం. ప్రతి రెండో రోజు కరోనా పరీక్షలు చేస్తారు. నిజానికి అంతా బాగానే చూసుకుంటున్నారు. కానీ ఇండియాలో పరిస్థితి ఎలా ఉందో రోజూ టీవీల్లో చూస్తున్నాం. హాస్పిటల్ బెడ్స్‌పై పేషెంట్లను చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ మనం ఇలా ఆడుతూ, అభిమానులకు వినోదాన్ని పంచుతున్నామంటే మేము ఎంత అదృష్టవంతులమో అని మేము నిన్ననే మాట్లాడుకున్నాం. కొవిడ్ భయం అందరికీ ఉన్నా.. టోర్నీ కొనసాగాలనే అనుకుంటున్నట్లు'' చెప్పాడు. ఇక కేకేఆర్ ఈ సీజన్లో దారుణ ప్రదర్శనను కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో మాత్రమే గెలిచి నాలుగు పరాజయాలు చవిచూసింది. కాగా నేడు పంజాబ్ కింగ్స్‌తో అహ్మదాబాద్ వేదికగా అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: ఐపీఎల్‌కు కరోనా ఎసరు.. గుడ్‌బై చెబుతున్న ఆటగాళ్లు! -
నా మాటల్ని మార్క్ చేసుకోండి..: కేకేఆర్ మెంటార్
ముంబై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుసగా విఫలం అవుతున్న కేకేఆర్ స్టార్ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కచ్చితంగా తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడని ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ ధీమా వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన గిల్ కనీసం అన్ని పరుగులు కలిసి వంద కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేకేఆర్ ఓటములకు ఓపెనర్ గిల్ స్థాయి తగ్గ ఆటను ప్రదర్శించకపోవడం కూడా కారణమంమంటూ మండిపడుతున్నారు. దీనిపై పోస్ట్ మ్యాచ్ కాన్పరెన్స్‌లో హస్సీకి ఎదురైన ప్రశ్నలో భాగంగా గిల్ ప్రదర్శనపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ అతనొక స్టార్ ప్లేయర్. టెక్నికల్‌గా కూడా మంచి పట్టున్న ప్లేయర్. ఫామ్ అనేది వస్తుంది.. పోతుంది. క్లాస్ అనేది ఎప్పుడూ శాశ్వతం. అతనొక క్లాస్ ఆటగాడు. ఆఫ్ ఫీల్డ్, ఆన్ ఫీల్డ్‌లో అతనొక క్లాస్. నా మాటల్ని గుర్తు పెట్టుకోండి. ఈ సీజన్ ముగిసే సరికి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ కూడా ఉంటాడు’ అని తెలిపాడు. రాజస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ దారుణంగా ఓడిపోయింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. గిల్ 11 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఇక్కడ చదవండి: అతని కెప్టెన్సీతో హ్యాపీగా లేరు : సెహ్వాగ్ -
‘ఐపీఎల్ చేదు జ్ఞాపకాలను మరిచిపోయాడు’
కోల్‌కతా: గతేడాది జరిగిన ఐపీఎల్లో తీవ్రంగా నిరాశ పరిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ పేర్కొన్నాడు. 2019 ఐపీఎల్ తాలూకు చేదు జ్ఞాపకాలను పూర్తిగా మరిచిపోయి... త్వరలో ఆరంభమయ్యే సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు కుల్దీప్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని హస్సీ తెలిపాడు. ‘కుల్దీప్ యాదవ్‌ను గత తొమ్మిది రోజులుగా ప్రాక్టీస్ సెషన్లో చూస్తున్నా. అతడు చాలా చురుగ్గా ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేస్తున్నాడు. రెండు వైపులా బంతిని టర్న్ చేయగలుగుతున్నాడు. ఫీల్డింగ్‌లో కూడా మెరుగయ్యాడు’ అని హస్సీ వ్యాఖ్యానించాడు. 2019 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ తరఫున 9 మ్యాచ్‌ల్లో ఆడిన కుల్దీప్... 4 వికెట్లు మాత్రమే తీశాడు. 8.66 ఎకానమీ రేటుతో పరుగులను ధారాళంగా సమర్పించుకోవడంతో... జట్టు సారథి దినేశ్ కార్తీక్ అతడిని తుది జట్టునుంచి తప్పించాడు. ముఖ్యంగా ఆ ఏడాది బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కుల్దీప్ కంటతడి కూడా పెట్టాడు. కుల్దీప్ వేసిన 16వ ఓవర్లో బెంగళూరు ఆల్‌రౌండర్ మొయిన్ అలీ రెండు ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. ఆ ఓవర్లో 27 పరుగులు ఇవ్వడంతో... ఓవర్ ముగిసిన తర్వాత కుల్దీప్ మైదానంలో కూర్చోని బోరున విలపించాడు. (చదవండి: తన బ్యాట్లను రిపేర్ చేస్తున్న కోహ్లి..) -
ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
ముంబై: వందకు పైగా పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డేలు, ట్వంటీ 20లు కలిపి) ఆడినా తనకు చిరకాలవాంఛ మాత్రం అలాడే ఉండిపోయిందంటూ ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బాట్స్ మన్ ఆరోన్ ఫించ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఆసీస్ ఆటగాడు డేవిడ్ హస్సీ గతే తనకు పడుతుందేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హస్సీ 108 మ్యాచులు (వన్డేలు, ట్వంటీ 20లు కలిపి) ఆడినా టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేయలేకపోయాడు. మరోవైపు ఫించ్ ఇప్పటివరకూ 79 వన్డేలు, 28 ట్వంటీ20 మ్యాచ్ లలో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటికీ తనకు టెస్టుల్లో బ్యాగీ గ్రీన్ క్యాప్ ధరించే అవకాశం రాలేదని నిరాశ చెందుతున్నాడు. ఆటతీరు ఎంత మెరుగైనా, పరుగులతో రాణిస్తున్నా అవకాశం దక్కడం లేదంటున్నాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ కే తన టాలెంట్ పరిమితం కావడంతో తాను ఏమాత్రం హ్యాపీగా లేనని స్పష్టంచేశాడు ఫించ్. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 23న పుణేలో ప్రారంభమవుతోంది. ఇందులోనూ అతడు ఎంపిక కాలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో గత మూడేళ్లలో 54.53 సగటుతో దూసుకుపోతున్నాడు ఫించ్. అయితే ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి సగటు 27.47గా ఉంది. విక్టోరియా జట్టు తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ ఛాన్స్ రావడంతో ఆటతీరు ఎంతో మెరుగైంది. ఆసీస్ జాతీయ జట్టులో అరంగేట్రం చేసి నాలుగేళ్లు గడిచినా టెస్టుల్లో మాత్రం ఇంకా తనకు ఛాన్స్ రాలేదని దిగులు చెందుతున్నాడు.