
ఐపీఎల్-2023లో అదరగొడుతున్న కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ డేవిడ్ హస్సీ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో రింకూ సింగ్ ఖచ్చితంగా భారత్ తరపున ఆడుతాడని డేవిడ్ హస్సీ జోస్యం చెప్పాడు. ఈ ఏడాది సీజన్‌లో రింకూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది ఓవర్‌నైట్ స్టార్‌గా రింకూ సింగ్ మారాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 251 పరుగులు చేశాడు. రింకూ సింగ్ కోల్‌కతా తరఫున 2018 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
"రింకూ సింగ్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. అతడు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అదే విధంగా అతడికి కేకేఆర్ ఫ్రాంచైజీ బాగా మద్దతుగా నిలిచింది. రింకూ కూడా తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత్ తరపున ఆడుతాడు" అని స్టార్‌స్పోర్ట్స్ షోలో హస్సీ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఢిల్లీతో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పులు! ఆంధ్ర ఆటగాడు ఎంట్రీ