హేయ్‌ నీ దగ్గర వాటర్‌ ఉందా? బుమ్రా- సంజన, సూర్య- దేవిషా ఫొటో వైరల్‌! | IPL 2021 Phase 2: Bumrah and Suryakumar Yadav Conversation Goes Viral | Sakshi
Sakshi News home page

IPL 2021 Phase 2: హే వాటర్‌ ఉందా? బుమ్రా- సంజన, సూర్య- దేవిషా ఫొటో వైరల్‌!

Published Sat, Sep 18 2021 5:59 PM | Last Updated on Sat, Sep 18 2021 6:04 PM

IPL 2021 Phase 2: Bumrah and Suryakumar Yadav Conversation Goes Viral - Sakshi

Jasprit Bumrah- Suryakumar Yadav: ఐపీఎల్‌- 2021 రెండో అంచె కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు ప్రాక్టీసులో మునిగిపోయారు. పొట్టి ఫార్మాట్‌లోని సిసలైన మజాను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా ఫ్రాంఛైజీలు సైతం ఎప్పటికప్పుడు తమ క్రికెటర్ల వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఓ సరదా సంఘటనకు సంబంధించిన ఫొటోను పంచుకుంది. 

ముంబై స్టారు ప్లేయర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ తమ భార్యలతో కలిసి క్వారంటైన్‌లో ఉన్నప్పటి దృశ్యం ఇది. కింది అంతస్తులో బుమ్రా- సంజనా గణేషన్‌ దంపతులు ఉండగా.. పై ఫ్లోర్‌లో భార్య దేవిషా శెట్టితో సూర్య ఉన్నాడు. ఇరు జంటలు సంభాషించుకున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్‌ చేసిన ముంబై.. ‘‘హే... నీ దగ్గర నీళ్లు ఉన్నాయా’’ అని పరస్పరం ప్రశ్నించుకుంటున్నట్లుగా ఉన్నారంటూ సరదా క్యాప్షన్‌ జతచేసింది.

ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి హ్యాట్రిక్‌ టైటిల్‌తో ఈ సీజన్‌ ముగించాలని ఫ్యాన్స్‌ ఈ సందర్భంగా పేసర్‌ బుమ్రా, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకు విషెస్‌ చెబుతున్నారు. కాగా ముంబై జట్టుకు వీరిద్దరు కీలక ప్లేయరన్న సంగతి తెలిసిందే. ఇక రెండో అంచెలో భాగంగా ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. 

చదవండి: CSK Vs MI: సీఎస్‌కే ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదంటే మరోసారి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement