IPL 2021 RCB Vs KKR: Live Score Updates, Match Highlights In Telugu - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: హ్యాట్రిక్‌‌ విజయం‌తో దుమ్మురేపిన ఆర్‌సీబీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Published Sun, Apr 18 2021 3:04 PM | Last Updated on Sun, Apr 18 2021 7:36 PM

IPL 2021: RCB Vs KKR Live Updates, Highlights - Sakshi

Photo Courtesy: BCCI/IPL

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆర్‌సీబీ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది.205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కేకేఆర్‌ బ్యాటింగ్‌లో ఆండ్రీ రసెల్‌ 31 పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షకీబ్‌ 26, మోర్గాన్‌ 29 పరుగులు చేశారు. చివర్లో రసెల్‌ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డా చేయాల్సిన పరుగులు అప్పటికే ఎక్కువగా ఉండడంతో ఏ లాభం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో జేమిసన్‌ 3, చహల్, హర్షల్‌ పటేల్‌ చెరో 2 వికెట్లు తీశారు.

దీంతో కేకేఆర్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం చవిచూడగా.. ఆర్‌సీబీ మాత్రం హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్‌ (78), డివిలియర్స్‌ (76 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

రసెల్‌ విధ్వంసం.. ఒకే ఓవర్లో 19 పరుగులు
కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ ఆండీ రసెల్ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో‌ ఫోర్లు, సిక్సర్లో విధ్వంసం సృష్టించాడు. చహల్‌ వేసిన ఆ ఓవర్లో 6,4,4,4తో మొత్తంగా 19 పరుగులు వచ్చాయి. దీంతో కేకేఆర్‌ 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

రసెల్‌ విధ్వంసం.. ఒకే ఓవర్లో 19 పరుగులు
కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ ఆండీ రసెల్ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో‌ ఫోర్లు, సిక్సర్లో విధ్వంసం సృష్టించాడు. చహల్‌ వేసిన ఆ ఓవర్లో 6,4,4,4తో మొత్తంగా 19 పరుగులు వచ్చాయి. దీంతో కేకేఆర్‌ 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

ఐదో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 29 పరుగులు చేసి హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్‌ 114 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్‌ స్కోరు 15 ఓవర్లలో 121/5గా ఉంది. షకీబ్‌ 22, రసెల్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
కేకేఆర్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. చహల్‌ తాను వేసిన రెండు వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బతీశాడు. మొదట ఇన్నింగ్స్‌ 7వ ఓవర్లో 18 పరుగులు చేసిన రానాను పెవిలియన్‌ పంపించిన చహల్‌ తన తర్వాతి ఓవర్లో దినేష్‌ కార్తిక్‌ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. షకీబ్‌ 3, మోర్గాన్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌
చెపాక్‌ వేదికగా ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 57 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన రాహుల్‌ త్రిపాఠి సుందర్‌ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ స్కోరు 6 ఓవర్లలో 57/2గా ఉంది. 

గిల్‌ ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌ 
205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ శుబ్‌మన్‌ గిల్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. రెండు వరుస సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన గిల్‌ జేమిసన్‌ బౌలింగ్‌లో డేనియల్‌ క్రిస్టియన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 2 ఓవర్లో వికెట్‌ నష్టానికి 27 పరుగులు చేసింది. రానా 1, త్రిపాఠి 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

డివిలియర్స్‌ విధ్వంసం.. ఆర్‌సీబీ 204/4
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ  భారీ స్కోరు సాధించింది. మొదట మ్యాక్స్‌వెల్‌ దూకుడు కనబర్చగా.. ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్ సిక్సర్లతో‌ విధ్వంసం సృష్టించాడు. దీంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ 78, డివిలియర్స్‌ 76 నాటౌట్‌, పడిక్కల్‌ 25 పరుగులు చేశాడు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 2, కమిన్స్‌, ప్రసిధ్‌ కృష్ణ చెరో వికెట్‌ తీశారు. అంతకముందు ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ సిక్స్‌తో ఈ సీజన్‌లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించాడు.

మ్యాక్స్‌వెల్‌ ఔట్‌.. నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ కీలక వికెట్‌ కోల్పోయింది. ఆరంభం నుంచి దూకుడైన ఆటతీరు కనబరిచిన మ్యాక్స్‌వెల్‌( 78, 49 బంతులు; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌కు యత్నించి హర్భజన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. డివిలియర్స్‌ 49, జేమిసన్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.  

దూకుడు కనబరుసున్న ఆర్‌సీబీ.. 15 ఓవర్లలో 134/3
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ దూకుడైన ఆటతీరు కనబరుస్తుంది. మ్యాక్స్‌వెల్‌, డివిలియర్స్‌ వేగంగా పరుగులు సాధిస్తుండడంతో 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ 76, డివిలియర్స్‌ 22 పరుగులతో ఆడుతున్నారు.

పడిక్కల్ ఔట్‌.. ఆర్‌సీబీ మూడో వికెట్‌ డౌన్‌
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ దేవదత్‌ పడిక్కల్‌(25) రూపంలో మూడో వికెట్‌  కోల్పోయింది. ప్రసిధ్‌ కృష్ణ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ తొలి బంతిని పడిక్కల్‌ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో రాహుల్‌ త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు మ్యాక్స్‌వెల్‌ మాత్రం దాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 12 ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ 61, డివిలియర్స్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

మ్యాక్స్‌వెల్‌ హాఫ్‌ సెంచరీ.. ఆర్‌సీబీ 78/2
ఆర్‌సీబీ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సీజన్‌లో వరుసగా రెండో​ అర్థ సెంచరీ నమోదు చేశాడు. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ ఆరంభం నుంచే దూకుడు కనబరిచాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ 28 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. మ్యాక్సీ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్‌సీబీ 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. పడిక్కల్‌ 18 పరుగులతో మ్యాక్స్‌వెల్‌కు సహకరిస్తున్నాడు.

7 ఓవర్లలో ఆర్‌సీబీ 53/2
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్‌ పడిక్కల్‌, మ్యాక్స్‌వెల్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నారు, షకీబ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో ఒక సిక్స్‌, రెండు ఫోర్లు సహా మొత్తం 17 పరుగులు రావడంతో 6 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు పరుగులు చేసింది.  ప్రస్తుతం ఆర్‌సీబీ ఏడు ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగుతో ఆడుతుంది. మ్యాక్స్‌వెల్‌ 30, పడిక్కల్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు‌.. ఆర్‌సీబీ 9/2
చెపాక్‌ వేదికగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో తొలుత రెండో బంతికి కోహ్లి వెనుదిరగ్గా.. ఆఖరి బంతికి రజత్‌ పాటిధార్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి వేసిన రెండో బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో కోహ్లి(5) త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను త్రిపాఠి వెనక్కి పరిగెడుతూ సూపర్‌ ‍ క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత రజత్‌ పాటిధార్‌ను చక్రవర్తి క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో 9 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పో‍యింది. ప్రస్తుతం ఆర్‌సీబీ 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.

చెన్నై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా విజయాలు సాధించి ఊపు మీద ఉన్న ఆర్సీబీ ఒకవైపు,  ఒక మ్యాచ్‌లో గెలుపు, మరొక దాంట్లో ఓటమితో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరొకవైపు నేటి మ్యాచ్‌లో(ఆదివారం) తలపడనున్నాయి.  తాజా మ్యాచ్‌లో  ఆర్సీబీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన విరాట్‌ కోహ్లి ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్‌లో ఇరుజట్లకు ఇదే తొలి మ్యాచ్‌ కావడంతో ఎవరి ప్రణాళికల్ని వారు సిద్ధం చేసుకుని పోరుకు సిద్ధమయ్యారు.

ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లపై ఆర్సీబీ విజయం సాధించగా, సన్‌రైజర్స్‌పై  విజయం సాధించిన కేకేఆర్‌.. ఆపై ముంబై చేతిలో ఓటమి పాలైంది. కాగా, ఆర్సీబీ-కేకేఆర్‌లు ఇప్పటివరకూ 27సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో కేకేఆర్‌ 15సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ 12 మ్యాచ్‌లో గెలుపును అందుకుంది. ఇక ఇరుజట్లు తలపడిన గత ఐదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీదే పైచేయిగా ఉంది. గత ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీనే విజయం సాధించింది. 

2008 సీజన్‌ మొదలు 2020 సీజన్‌ వరకూ చూస్తే ఇరు జట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లి(ఆర్సీబీ) 725 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. క్రిస్‌ గేల్‌(2011-17 సీజన్‌ల మధ్య-ఆర్సీబీ) 557 పరుగులు చేశాడు. ఇక గౌతం గంభీర్‌(2011-17 సీజన్‌ల మధ్య-కేకేఆర్‌) 530 పరుగులు సాధించాడు. బౌలింగ్‌ విభాగంలో సునీల్‌ నరైన్‌(2012 సీజన్‌ నుంచి-కేకేఆర్‌కు) 16 వికెట్లు సాధించగా, యజ్వేంద్ర చహల్‌(2014 నుంచి-ఆర్సీబీకి) 14 వికెట్లు తీశాడు.

కేకేఆర్‌
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), నితీష్‌ రానా, శుబ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, షకిబుల్‌ హసన్‌, దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, హర్భజన్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, వాషింగ్టన్‌ సుందర్‌, షెహబాజ్‌ అహ్మద్‌, జెమీసన్‌, మహ్మద్‌ సిరాజ్‌, యజ్వేంద్ర చహల్‌, హర్షల్‌ పటేల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement