
కర్టసీ: ఐపీఎల్ వెబ్‌సైట్
చెన్నై: చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. చహల్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ చివరి బంతిని క్రిస్ లిన్ కవర్స్ దిశగా ఫ్లిక్ చేశాడు. లిన్, రోహిత్‌ల మధ్య చిన్నపాటి కమ్యునికేషన్ గ్యాప్ రావడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రోహిత్ క్రీజు దాటి ముందుకు వచ్చేశాడు. అయితే గల్లీలో చురుగ్గా ఉన్న కోహ్లి బంతిని చహల్‌కు త్రో వేయగా.. అతను క్షణం ఆలస్యం చేయకుండా వికెట్లను గిరాటేయడంతో రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి చేసిన రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక కెప్టెన్‌ను ఇంకో కెప్టెన్ రనౌట్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ముంబై 8వ ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. ఓపెనర్ లిన్ 32, సూర్యకుమార్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment